కాజల్ 'టెంపర్' పెంచబోతుంది..!
on Nov 26, 2014
యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కాజల్, అభిమానుల 'టెంపర్'ను హీటెక్కించడం ఖాయమని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం తెలుగులో కాజల్ నటిస్తున్న చిత్రం ఇదొక్కటే కావడంతో, ఈ సినిమాలో తన గ్లామర్ తడఖా చూపించి మరిన్ని అవకశాలు దక్కించుకోవాలని భావిస్తుందట. ఇది వరకు ఎన్నడూ చూడని కాజల్‌ని ఈసినిమాలో చూస్తారంటూ... ఇప్పటికే పూరి కూడా ఓ హింట్ ఇచ్చేశాడు. ఇటీవల గోవాలో చిత్రీకరించిన పాటలో కాజల్ రేచ్చిపోయిందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ సినిమాకే ఆ పాట హైలెట్ అవుతుందని చిత్రబృందం చెబుతోంది. మరి కాజల్ ఏ మేరకు అభిమానుల 'టెంపర్' రేపుతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే!