మహేష్ ని వదులుకున్న శృతి హాసన్..!
on Nov 25, 2014
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా నుంచి శృతి హాసన్ సడన్ గా తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో టెంపరరీగా ఈ ప్రాజెక్టు ఆగిపోయినట్లు సమాచారం. ఇప్పుడు ఆమె స్థానంలో సమంతను హీరోయిన్ గా ఎంపిక చేసే అవకాశం ఉందని అంటున్నారు. రీసెంట్‌గా ఈ మూవీ షూటింగ్ పూణెలో ప్రారంభమైంది. ఇక్కడ షూటింగ్ పూర్తి చేసుకుని తమిళంలో విజయ్ లేటెస్ట్ ఫిల్మ్‌కు శృతి హాజరవుతోంది. ఇప్పుడు మళ్ళీ మహేష్ సినిమా షూటింగ్ మొదలుకావడంతో కాల్షీట్లు ఇవ్వలేకపోయిందని సమాచారం. దీంతో ఆమె విజయ్ సినిమా కోసం మహేష్ సినిమాను వదులుకుందని అంటున్నారు. మరి శృతి తప్పుకున్నట్లు వస్తున్న వార్తల్లో నిజమెంత అనేది తెలియాల్సివుంది.