మిర్చి సిటీలో టెంపర్ లేనట్లే..!
on Nov 28, 2014
ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘టెంపర్’. ఈ సినిమా ఆడియో కార్యక్రమాన్ని గుంటూరులో విడుదల చేయబోతున్నట్లుగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ వార్తలను నిర్మాత బండ్ల గణేష్ ఖండించారు. టెంపర్’ ఆడియో విడుదల కార్యక్రమాన్ని గుంటూరులో నిర్వహిస్తున్నట్లుగా వార్తలు ఎలా వస్తున్నాయో అర్థం కావడం లేదు. అసలు గుంటూరులో నిర్వహించాలనే ఆలోచన కూడా మాకు రాలేదు అని గణేష్ తెలిపారు. మరోవైపు వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఈ సినిమాతో ఓ భారీ విజయం దక్కుతుందని అభిమానులు ఆశీస్తున్నారు. నిన్న రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లను చూస్తుంటే ఎన్టీఆర్ నిజంగానే ఓ భారీ హిట్ కొట్టేటట్టున్నాడు.