మెగా ఫ్యామిలీ మిస్సయ్యిందా?
on Mar 16, 2015
అల్లు అర్జున్ కొత్త సినిమా సన్ ఆఫ్ సత్యమూర్తి ఆడియో ఫంక్షన్‌కు మెగా ఫ్యామిలీ నుంచి ఒక్క హీరో కూడా రాకపోవటం చర్చినీయాంశమయ్యింది. మెగా ఫ్యామిలీ ప్రతి ఫంక్షన్‌లలో కచ్చితంగా కనిపించే అల్లు అర్జున్ ఫంక్షన్ కి ఒక్కరు కూడా రాకపోటవటంతో ఆడియో ఫంక్షన్ కళ తప్పింది. పవన్‌కల్యాణ్ రారని ముందే తెలిసినా, రామ్‌చరణ్, వరుణ్‌తేజ్, సాయి ధరమ్‌తేజ్‌లు రాకపోవడం మరింత చర్చినీయాంశంగా ఉంది. అల్లు అరవింద్‌తో ఎంతో సన్నిహితంగా ఉండే చిరంజీవి షూటింగ్‌లు లేకుండా, రాజకీయాలకు దూరంగా ఖాళీగానే ఉంటున్న కూడా బన్నీ ఆడియో ఫంక్షన్‌కు రాకపోవటం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది.