సత్యమూర్తిని కోనేసిన దిల్ రాజు
on Mar 16, 2015
ఓ పెద్ద సినిమా విడుదల అవుతోందంటే నైజాం రైట్స్ కోసం ముందుగా కర్చిఫ్ వేసే దమ్ము ధైర్యం దిల్‌రాజు కే ఉన్నాయి. సినిమా భవిష్యత్తుని చక్కగా క్యాలిక్లేట్ చేసే దిల్‌రాజు చేతిలో సినిమా పడితే ఆ సినిమా హిట్టే అని నమ్ముతారు సినీ జనాలంతా. ఆ మధ్య కాస్త దెబ్బలు తిన్నాక నెమ్మదించారు. ఇటీవల మళ్లీ పుంజుకున్నారు. అంతవరకు కేవలం పంపిణీ చేయడం తప్ప కొనే పని పెట్టుకోలేదు. కానీ ఇప్పుడు మళ్లీ మొదలెట్టారు. సన్నాఫ్ సత్యమూర్తి నైజాం హక్కులనుదాదాపుగా రూ.11. 5 కోట్లు చెల్లించి ఆయన సొంతం చేసుకొన్నారు.అంటే ఆ సినిమా పై వున్న క్రేజ్ ఎంతో అర్థం చేసుకోవచ్చు.