అలీ.. మళ్లీ బూతు జోకు వేశాడు
on Mar 16, 2015
అలీ స్టేజ్ ఎక్కితే హుషారు వచ్చేస్తుంది అనడం ఎంత వాస్తవమో... స్టేజీ ఎక్కిన వెంటనే అలీ పూనకం వచ్చినట్టు ఊగిపోయి, ఆ ఊపులో బూతులు కూడా మాట్లాడేస్తాడన్నది అంతే నిజం. సన్నాఫ్ సత్యమూర్తి ఆడియో వేడుకలో ఈ విషయం ఇంకోసారి పునరావృతం అయ్యింది. ''నాకు తోడుగా అలీ కూడా వచ్చి యాంకరింగ్ చేస్తే బాగుంటుంది'' అని సుమ అన్న పాపానికి.. సుమని ఉద్దేశించి ఓ బూతు జోకు వదిలాడు అలీ. ఈ కార్యక్రమంలో థియేటరికల్ ట్రైలర్ ఆవిష్కరించాడానికి వేదికపైకి అల్లు అరవింద్ వచ్చారు. ఆయన్ని ఉద్దేశించి అలీ మాట్లాడుతూ ''ట్రైలర్ ప్లే కావడానికి ఏది నొక్కాలి ఏది నొక్కాలి అంటూ నన్ను అడుగుతున్నారు అరవింద్ గారూ. ఇదే మాట సుమని అడిగితే ఎట్టా ఉండేదో..'' అంటూ ఓ బూతు జోకు పేల్చాడు. దాంతో సుమ ఏడవలేక నవ్వింది. మరోసారి బ్యాంకాక్ వెళ్లి నాది తీయించేసుకొంటా... అంటూ ఇంకో బూతు జోకు వేశాడు. అలీ అంటే అందరికీ గౌరవం. బాగా నవ్విస్తాడని. ఇదిగో ఇలాంటి సమయాల్లోనే అలీపై ఏహ్యభావాలు కలుగుతుంటాయి. నవ్వించాలన్నఆలోచన మంచిదే. అందుకోసం మరో అమ్మాయిని హేళన చేసి మాట్లాడడం, అదీ.. ఇలాంటి వేడుకల్లో ఏది పడితే అది మాట్లాడేయడం మంచిది కాదన్న విషయాన్ని అలీ ఎప్పుడు గుర్తిస్తాడో.