బాహుబలి 2 మొత్తం కథ, కట్టప్ప సీక్రెట్ తో సహా
on Apr 17, 2017
రాజమౌళి దృశ్యకావ్యం బాహుబలి 2 ప్రతిష్టాత్మకంగా ఈ నెల 28 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవనుంది. ఈ సినిమాని ప్రతి ఒక్కరు మిస్ అవకుండా ఖచ్చితంగా చూడాలి అనుకుంటున్నారు. దానికి కారణాలు అనేకం. అన్నింటి కన్నా ప్రధాన కారణం మాత్రం- కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే విషయం తెలుసుకోవాలనే ఉత్కంఠ. బాహుబలి 2 కథ ఇది అని చాలా మంది చాలా రకాలుగా చెబుతున్నారు. కానీ, కట్టప్ప సీక్రెట్ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది.
అమరేంద్ర బాహుబలి (ప్రభాస్) మరియు భల్లాలదేవ (రానా) ఇద్దరు ఓకే అమ్మాయి దేవసేన (అనుష్క) ని ప్రేమిస్తారు. కానీ, దేవసేన మాత్రం బాహుబలిని ఇష్టపడుతుంది. ఈ విషయంలో గొడవ జరిగి బాహుబలి రాజ్యం వదిలేసి దేవసేనని పెళ్లి చేసుకొని ఆమెతో గడుపుతుంటాడు. భల్లాలదేవ బాహుబలికి సపోర్ట్ చేసిన వాళ్ళందరిని హింసలకు గురిచేస్తూ ఉంటాడు. ఈ మధ్యలో, కాలకేయుడి తమ్ముడు మాహిష్మతి రాజ్యంపై దండయాత్ర చేస్తాడు. ఈ సమయంలో బాహుబలి తన సైన్యంతో పోరాడి, కాలకేయుడి తమ్ముణ్ణి చంపేస్తాడు.
బాహుబలి తిరిగి పట్టాభిషిక్తుడై మాహిష్మతి రాజ్యానికి రాజుగా తిరిగి వస్తాడు. ఇది జీర్ణించుకోలేని భల్లాలదేవ అతని తండ్రి బజ్జలదేవ (నాజర్) కుట్ర పన్ని బాహుబలిని అంతం చేయాలనుకుంటారు. తన సైన్యం లో పనిచేసే సుబ్బరాజ్ కి ఆశ జూపి బాహుబలి కత్తి ని దొంగలించి, తన పైనే (భల్లాలదేవ) దాడికి ప్రయత్నం గా చిత్రీకరిస్తారు. ఈ సంఘటనలో సుబ్బరాజ్ ని చంపేస్తారు. భల్లాలదేవ చెప్పింది నిజమని నమ్మి బాహుబలిని చంపమని కట్టప్పని (సత్యరాజ్) ఆజ్ఞాపిస్తుంది శివగామి (రమ్య కృష్ణ). రాణి ఆజ్ఞానుసారం కట్టప్ప బాహుబలిని చంపుతాడు. కానీ, అసలు విషయం తెలుసుకున్న శివగామి, బాహుబలి కొడుకుని రక్షించే క్రమంలో తన ప్రాణాలు కోల్పోతుంది.
చివరికి, విషయం మొత్తం తెలుసుకున్న శివుడు తన తండ్రి బాహుబలి చావుకి ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడు అనేది మిగతా కథ- అంటే యుద్ధమే. ఇది మాకు తెలిసిన కథ. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.