నేనయితే నోటీసులు పంపను అంటున్న ఏసుదాస్
on Apr 17, 2017

లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మెలోడీ బ్రహ్మ ఇళయరాజాల లీగల్ నోటీసు వ్యవహారం గురించి జనాలు దాదాపు మరచిపోయారు. మలయాళ గాయకుడు కేజే ఏసుదాస్ ని ఈ విషయం గురించి ప్రస్తావించగా, 'నేనయితే ఎవ్వరికీ అలా లీగల్ నోటీసులు పంపేవాణ్ణి కాదు. నన్ను అడగడం కన్నా ఇళయరాజా ని అడిగితే బెటర్,' అని తన అభిప్రాయం చెప్పారు. మురుగదాస్ మరియు ఇంకొందరు దక్షిణ చిత్ర సీమకి చెందిన వారు, జాతీయ అవార్డుల విషయంలో ఇక్కడి వాళ్లంటే వివక్ష అని జ్యురీ పక్షపాత ధోరణి వ్యవహరిస్తుందని చెప్పిన విషయం తెలిసిందే. దీని గురించి ఏసుదాస్ ని అడగగా, 'ఈ సందేహం ఎవరైతే వ్యక్తపరిచారో వాళ్లనే అడగడం మంచిది. లేదంటే, జ్యురీ ని అడగాలి. అంతే కానీ, సంబంధం లేని నాలాంటి వాళ్ళని అడగడం కరెక్ట్ కాదు,' అని చెప్పారు. ఇటీవలే రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న ఏసుదాస్, కోయంబతూర్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సౌత్ లో జరుగుతున్న కొన్ని విషయాలపై తన అభిప్రాయం ఇలా వెలిబుచ్చారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



