ఆ నిర్మాతతో అనుష్క పెళ్లి రూమరేనా..?
on Oct 1, 2016
టాలీవుడ్, కోలీవుడ్లో పెళ్లి కాని హీరోయిన్ల లిస్ట్ తీస్తే అందులో ఫస్టుండే పేరు అనుష్కదే. ఈవిడ పెళ్లి గురించి అప్పటి నుంచి నేటి దాకా రకరకాల పుకార్లు వెలుగుచూశాయి. గతంలో అక్కినేని నాగచైతన్యతో అనుష్క పెళ్లి జరిగిందని రూమర్స్ రావడం..దానిని ఇరు కుటుంబాలు ఖండించడమూ జరిగిపోయింది. రీసెంట్గా ఒక టాలీవుడ్ అగ్రనిర్మాతను స్వీటీ పెళ్లిచేసుకోబోతోందనే వార్త తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు ఆమె అభిమానులను ఉలిక్కిపడేలా చేసింది. అయితే గతంలో ఎన్నోసార్లు పుకార్లను ఎదుర్కొని వాటిని చూసి చూడనట్టు వదిలేసిన అనుష్క ఈసారి మాత్రం గట్టిగా స్పందించారు.
సినీ పరిశ్రమలో వదంతులన్నవి సర్వసాధారణం. అలాంటివి వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపినా అది కొంతసేపే..ఆ తర్వాత తిరిగి మామూలు స్థితికి వచ్చేస్తాం. అయినా మనం తప్పు చేయనప్పుడు ఎందుకు బాధ పడాలి. ఇలాంటి వాటికి ఏడుస్తూ కూర్చుంటే మన:శాంతి కూడా ఉండదు. అందుకే వాటిని నా మనస్సులోకి రానివ్వను. అందుకే తాను ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నానంటూ చెప్పుకొచ్చింది జేజేమ్మ. అనుష్క చెప్పిన దానిని బట్టి చూస్తే ఆ అగ్రనిర్మాతతో పెళ్లికూడా రూమరేనా...? ఏమో అన్నిటికి కాలమే సమాధానం చెబుతుంది.