ఎన్టీఆర్‌తో "బ్రదర్స్" ఇప్పట్లో లేదా..?
on Oct 4, 2016

నందమూరి మూడో తరం హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు కళ్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లు. మాస్ ఫార్ములాలతో వరుస బ్లాక్‌బస్టర్లతో టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు ఎన్టీఆర్. ఒకవైపు హీరోగా చేస్తూనే నిర్మాతగానూ సక్సెస్ అయ్యాడు కళ్యాణ్‌రామ్. వీరిద్దరికి ఒకరంటే ఒకరికి అభిమానం..ఎవరి మూవీ ఫంక్షన్ అయినా ఇద్దరు హాజరవుతూ అన్నదమ్ముల అనుబంధం అంటే ఎంటో చూపిస్తున్నారు. అయితే అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా అన్నదమ్ములిద్దరూ ఒకే సినిమాలో చేస్తే చూడాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు.
తాజాగా వీరిద్దరూ ఒక మల్టీస్టారర్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వచ్చాయి. దానికి తోడు కళ్యాణ్‌రామ్ తన "ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై" బ్రదర్స్ అనే టైటిల్‌ని రిజిస్టర్ చేయించాడు. దాంతో ఆ బ్రదర్స్ టైటిల్ ఎన్టీఆర్‌తో మూవీ కోసమేనని పుకార్లు షీకారు చేశాయి. అయితే ఈ వార్త నిజమని ఇద్దరిలో ఏ ఒక్కరూ కన్ఫార్మ్ చేయలేదు. లేటేస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇజం ఆడియో రిలీజ్ నాడు ఈ సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ ఆడియో లాంఛ్‌కు చీఫ్ గెస్ట్‌గా ఎన్టీఆర్ రానుండటంతో ఆరోజు బ్రదర్స్ భవితవ్యం తేలిపోతుందని సినీ జనాలు భావిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



