తమన్నాపై నిర్మాత ఫైర్
on Sep 29, 2016

సినిమా ఒప్పుకొనే ముందు పారితోషికం, సౌకర్యాలు అంటూ సవాలక్ష కండీషన్‌లు పెడుతుంటారు కథానాయికలు. తీరా ఒప్పుకొని.. సినిమా విడుదల దగ్గర పడేసరికి ప్రమోషన్లకురాక నిర్మాతల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తుంటారు. నిర్మాతలేమో బయటకు చెప్పుకోలేక, లోలోపల దాచుకోలేక కుమిలిపోతుంటారు. కొంతమంది ధైర్యంగా ముందడుగు వేసి.. కథానాయికలపై చర్యలు తీసుకొనేలా.. పావులు కదుపుతుంటారు. ప్రస్తుతం తమన్నాని టార్గెట్ చేశాడో నిర్మాత. తమన్నా ప్రమోషన్లకు రావడం లేదని, తమకేమాత్రం సహకరించడం లేదని తమన్నాపై నిప్పులు కురిపిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. తమన్నా తమిళంలో ధర్మదురై అనే సినిమా చేసింది. ఈసినిమాకి గానూ.. రూ.80 లక్షల వరకూ పారితోషికం అందుకొందట. ప్రమోషన్లకు సహకరిస్తానని ఎగ్రిమెంట్‌పై సంతకాలు చేసిందట.
అయితే తీరా ఇప్పుడు ప్రమోషన్లకు అందుబాటులో లేదని, ఫోన్లు చేస్తున్నా స్పందించడం లేదని ఆ చిత్ర నిర్మాత సురేష్ వాపోతున్నాడు. తమన్నాపైచర్యలు తీసుకొని, తనకు న్యాయం జరిగేలా చూడమని తమిళ ఫిల్మ్‌ఛాంబర్‌లో ఫిర్యాదు చేశాడట. దీనిపై తమన్నా స్పందించాల్సివుంది. తమన్నా ప్రమోషన్లు ఎగ్గొట్టే రకం కాదని, ఆ నిర్మాతతో వేగలేక తమన్నా దూరంగా ఉంటోందని, దీనిపై తమన్నా త్వరలోనే ఓ క్లారిటీ ఇస్తుందని తమన్నా సన్నిహితులు చెబుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



