SSMB 29 : మహేష్-రాజమౌళి సినిమాలో నాని!
on Mar 11, 2024
'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ సక్సెస్ అందుకున్న దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి(Rajamouli) తన తదుపరి సినిమాని మహేష్ బాబు(Mahesh Babu)తో చేస్తున్న సంగతి తెలిసిందే. కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ యాక్షన్ అడ్వెంచర్ రూపొందనుంది. ఈ మూవీతో 'బాహుబలి-2' రికార్డులు బ్రేక్ అవ్వడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటీనటులను రాజమౌళి రంగంలోకి దింపబోతున్నాడట. ఇప్పటికే కింగ్ నాగార్జున(Nagarjuna) ఈ ప్రాజెక్ట్ లో భాగం కానున్నాడని ఇటీవల న్యూస్ వినిపించగా.. ఇప్పుడు మరో తెలుగు స్టార్ పేరు తెరపైకి వచ్చింది. ఆ స్టారో ఎవరో కాదు నేచురల్ స్టార్ నాని.
'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' సినిమాలు.. విడుదల తర్వాత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాయి. అయితే 'SSMB 29' గురించి ముందు నుంచే అందరూ మాట్లాడుకుంటూ.. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా కోసం ఎదురుచూసేలా చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట. అందుకే నిడివితో సంబంధం లేకుండా ముఖ్యమైన అన్ని పాత్రల కోసం ప్రముఖ నటీనటులను రంగంలోకి దింపాలని నిర్ణయించుకున్నాడట. ఈ క్రమంలో పలు పాత్రల కోసం టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎన్నో పేర్లు పరిశీలిస్తున్నారట. ఇక ఒక పాత్ర కోసం నాని(Nani) పేరు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.
రాజమౌళి, నాని మధ్య మంచి అనుబంధం ఉంది. గతంలో రాజమౌళి రూపొందించిన 'ఈగ' సినిమాలో నాని నటించాడు. ఆ సినిమాలో నాని స్క్రీన్ మీద కనిపించేది తక్కువసేపే అయినప్పటికీ.. ఎంతో పేరు తెచ్చుకున్నాడు. అలాగే నాని హీరోగా నటించిన 'మజ్ను' సినిమాలో రాజమౌళి అతిథి పాత్రలో మెరిశాడు. జక్కన్న అడగాలి కానీ.. పాత్ర ఏంటని కూడా అడగకుండా నాని వెంటనే ప్రాజెక్ట్ కి ఓకే చెప్తాడు అనడంలో సందేహం లేదు. పైగా మహేష్ బాబు అంటే కూడా నానికి ప్రత్యేకమైన అభిమానముంది. కాబట్టి ఈ సినిమాలో నాని భాగం కావడం దాదాపు ఖాయమనే అంటున్నారు. అదే జరిగితే.. ఈ చిత్రంలో నాని పాత్ర ఎలా ఉంటుందో చూడాలి.
అలాగే ప్రభాస్(Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'కల్కి 2898 AD'(Kalki 2898 AD) సినిమాలో కూడా కృపాచార్యుడి పాత్రలో నాని నటించనున్నాడని ఇటీవల వార్తలు వినిపించాయి. ఇలా వరుసగా రెండు భారీ ప్రాజెక్ట్ లలో నాని ముఖ్య పాత్రలు పోషించనున్నాడనే న్యూస్ ఆసక్తికరంగా మారింది.
Also Read