ప్రభాస్ ‘స్పిరిట్’లో విలన్‌గా నటించే హీరో ఎవరో తెలుసా?
on Mar 7, 2024
గత ఏడాది ‘సలార్’, ‘యానిమల్’ సినిమాలు ఎంతటి సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. ‘సలార్’ తర్వాత ‘కల్కి’, ‘రాజా సాబ్’ చిత్రాలతో బిజీ అయిపోయాడు ప్రభాస్. ‘యానిమల్’ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా, ప్రభాస్ కాంబినేషన్‌లో రూపొందే ‘స్పిరిట్’ చిత్రాన్ని సెప్టెంబర్‌లో స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌లో అతనూ బిజీ అయిపోయాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైమ్ ఉంది. ఎందుకంటే ‘కల్కి’ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ సినిమాని మే 9న రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే. ఇక ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘రాజా సాబ్’ షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. ‘కల్కి’ షూటింగ్ పూర్తయిన తర్వాత ‘రాజా సాబ్’ సెట్స్‌కి వెళతాడు ప్రభాస్. అది కూడా పూర్తి చేసిన తర్వాత ప్రభాస్, సందీప్‌రెడ్డిల ‘స్పిరిట్’ సెట్స్‌పైకి వెళుతుంది.
ఇప్పటి వరకు సందీప్‌రెడ్డి చేసిన ‘అర్జున్‌రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాల్లో హీరో క్యారెక్టర్ ఎంత ఎక్స్‌ట్రీమ్‌గా ఉంటుందో మనం చూశాం. ‘స్పిరిట్’లో ప్రభాస్ క్యారెక్టర్ నెక్స్‌ట్ లెవల్‌లో ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడని ఇప్పటికే సందీప్ ప్రకటించాడు. ఫస్ట్‌టైమ్ ప్రభాస్‌ని పోలీస్ ఆఫీసర్‌గా ఎలా ప్రజెంట్ చేస్తాడోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి గత కొంతకాలంగా సందీప్ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూనే ఉన్నాడు. ‘స్పిరిట్’కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే.. ఈ సినిమాలో గోపీచంద్ విలన్‌గా నటించబోతున్నాడనేదే ఆ వార్త.
‘తొలివలపు’ చిత్రంతో హీరోగా ఇంట్రడ్యూస్ అయిన గోపీచంద్ ఆ సినిమా తర్వాత అవకాశాలు రాకపోవడంతో ‘జయం’, ‘నిజం’, ‘వర్షం’ వంటి సినిమాల్లో విలన్‌గా నటించి అందర్నీ మెప్పించాడు. ఆ తర్వాత ‘యజ్ఞం’ చిత్రంతో మరోసారి హీరోగా ఎంట్రీ ఇచ్చి సూపర్‌హిట్ కొట్టాడు. ఇక అప్పటి నుంచి హీరోగానే సినిమాలు చేస్తూ వచ్చాడు. అయితే ఈమధ్యకాలంలో అతని సినిమాలు ఆశించినంత విజయాలు అందుకోవడం లేదు. అందుకే మరోసారి విలన్‌గా చెయ్యాలనే ఆలోచనలో గోపీచంద్ ఉన్నాడని సమాచారం. రియల్ లైఫ్‌లో ప్రభాస్, గోపీచంద్ ఎంత మంచి స్నేహితులో అందరికీ తెలిసిందే. అందుకే ‘స్పిరిట్’లో గోపీచంద్ విలన్‌గా నటిస్తే బాగుంటుందని ప్రభాస్ సూచించాడని తెలుస్తోంది. సందీప్‌రెడ్డి సినిమాల్లో హీరో, విలన్ క్యారెక్టర్స్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటాయో తెలిసిందే. విలన్‌గా నటించిన అనుభవం గోపీచంద్‌కి ఉండనే ఉంది. ఇవన్నీ చూస్తుంటే ‘స్పిరిట్’లో గోపీచంద్ విలన్‌గా నటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ విషయంలో సందీప్‌రెడ్డి ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రభాస్ హీరోగా నటించిన ‘వర్షం’ చిత్రంలో విలన్‌గా గోపీచంద్ ఎంత అద్భుతంగా నటించాడో చూశాం. ‘స్పిరిట్’లో మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అయితే బాగుంటుందని ప్రభాస్ అభిమానులు కోరుతున్నారు. మరి ఈ విషయంలో ప్రభాస్, సందీప్‌రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.