అల్లు అర్జున్, అట్లీ మూవీలో విజయ్!
on Aug 21, 2025

'పుష్ప-2'తో ఇండియన్ సినిమా రికార్డులు తిరగరాసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, 'జవాన్'తో రూ.1000 కోట్ల క్లబ్ లో చేరిన డైరెక్టర్ అట్లీ.. ఓ భారీ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ కోసం చేతులు కలిపిన సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ మూవీ కోసం వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటీనటులను రంగంలోకి దింపుతున్నారు. ఈ క్రమంలోనే ఓ పవర్ ఫుల్ రోల్ కోసం విజయ్ సేతుపతి రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.
ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు ఇతర హీరోల సినిమాలలోనూ విభిన్న పాత్రలు పోషించి మెప్పిస్తుంటారు విజయ్ సేతుపతి. షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ రూపొందించిన 'జవాన్'లో కూడా నెగటివ్ రోల్ లో ఆకట్టుకున్నారు సేతుపతి. ఇప్పుడు అల్లు అర్జున్ తో చేస్తున్న సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ లో సైతం ఓ కీలక పాత్ర కోసం అట్లీ ఆయనను సంప్రదించినట్లు తెలుస్తోంది. విజయ్ కూడా ఈ సినిమా చేయడానికి వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. మరి ఇందులో ఆయన రోల్ ఎలా ఉంటుందో చూడాలి.
అల్లు అర్జున్ కెరీర్ లో 22వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ ప్రాజెక్ట్ లో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, భాగ్యశ్రీ బోర్సే, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



