అప్పుడే ఓటీటీలోకి కూలీ మూవీ..!
on Aug 24, 2025

సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో రూపొందిన మూవీ 'కూలీ'. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో నాగార్జున, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర ముఖ్య పాత్రలు పోషించారు. భారీ అంచనాలతో ఆగస్టు 14న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ మూవీ.. డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయినప్పటికీ ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ.400 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఫుల్ రన్ లో రూ.500 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఈ మూవీ త్వరలోనే ఓటీటీలో అడుగుపెట్టనుందన్న వార్త సంచలనంగా మారింది.
'కూలీ' డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు సొంతం చేసుకుంది. అయితే నార్త్ ఇండియా మల్టీప్లెక్స్ లలో కూలీ విడుదల కావడంతో.. అగ్రిమెంట్ ప్రకారం ఈ సినిమా ఓటీటీలోకి ఎనిమిది వారాల తర్వాతే వస్తుందని అందరూ భావించారు. కానీ, ఇప్పుడు అనూహ్యంగా నాలుగు వారాలకే ఓటీటీలోకి రానుందని ప్రచారం జరుగుతోంది. హిందీ వెర్షన్ మినహా.. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ వెర్షన్ లు సెప్టెంబర్ మొదటి వారం నుంచే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు న్యూస్ వినిపిస్తోంది. హిందీ వెర్షన్ మాత్రం ఎనిమిది వారాల తర్వాత స్ట్రీమ్ అవుతుందని వినికిడి. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



