పవన్ కళ్యాణ్ దర్శకుడితో విజయ్ దేవరకొండ మూవీ!
on Aug 11, 2025

'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' వంటి సినిమాలతో కెరీర్ స్టార్టింగ్ లో సంచలనాలు సృష్టించిన విజయ్ దేవరకొండ.. కొన్నేళ్లుగా ఆ స్థాయి విజయాలను అందుకోలేకపోతున్నాడు. ఇటీవల భారీ అంచనాలతో విడుదలైన 'కింగ్ డమ్' కూడా విజయ్ కోరుకున్న సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వలేకపోయింది. దీంతో విజయ్ తదుపరి చిత్రాలపై అందరి దృష్టి పడింది.
ప్రస్తుతం విజయ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒక దానికి రాహుల్ సాంకృత్యాయన్ దర్శకుడు కాగా, మరో చిత్రానికి రవికిరణ్ కోలా డైరెక్టర్. ఈ రెండు సినిమాల తర్వాత విజయ్ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ కి హరీష్ శంకర్ దర్శకుడని సమాచారం. విజయ్ గత చిత్రం 'కింగ్ డమ్' కూడా సితార బ్యానర్ లో రూపొందటం విశేషం.
గతేడాది 'మిస్టర్ బచ్చన్'తో నిరాశపరిచిన హరీష్ శంకర్.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే సినిమా చేస్తున్నాడు. ఇది 2026 ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి హరీష్.. ఉస్తాద్ తర్వాత మరో సినిమా చేస్తాడో లేదా డైరెక్ట్ గా విజయ్ ప్రాజెక్ట్ పైకి వెళ్తాడో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



