కొరటాల శివకు హీరో దొరికేశాడు.. దేవర-2 లేనట్టేనా?
on Aug 17, 2025

'మిర్చి', 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', 'భరత్ అనే నేను' వంటి సినిమాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు కొరటాల శివ. అలాంటి కొరటాలకు మొదటిసారి 'ఆచార్య' రూపంలో ఘోర పరాజయం ఎదురైంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన గత చిత్రం 'దేవర' కమర్షియల్ గా సక్సెస్ అయినప్పటికీ, దర్శకుడిగా కొరటాలకు మాత్రం పేరు తీసుకురాలేదు. దీంతో 'దేవర-2' ఉంటుందా లేదా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. మిగతా స్టార్స్ అందరూ ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటంతో.. ఒకవేళ దేవర-2 లేకపోతే కొరటాలకు హీరో దొరుకుతాడా లేదా? అనే ప్రశ్నలు కూడా వినిపించాయి. ఇలాంటి సమయంలో కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఒక హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న వార్త ఆసక్తికరంగా మారింది.
అక్కినేని హీరో నాగ చైతన్య తన 25వ సినిమాని కొరటాల డైరెక్షన్ లో చేయనున్నాడని తెలుస్తోంది. చైతన్య ప్రస్తుతం తన 24వ సినిమాని 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో చేస్తున్నాడు. దీని తర్వాత దర్శకుడు కొరటాలతో చేతులు కలపబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే చైతన్య-కొరటాల మధ్య కథా చర్చలు జరిగాయని, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని వినికిడి. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది అంటున్నారు.
అయితే దేవర-2 పూర్తయ్యాక చైతన్య ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా లేక ముందే మొదలవుతుందా? అనేది తెలియాల్సి ఉంది. ఎన్టీఆర్ ప్రజెంట్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ చేస్తున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్, నెల్సన్ ప్రాజెక్ట్ లు లైన్ లో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ ల నడుమ దేవర-2 కి ఎన్టీఆర్ ఎంతవరకు సమయం కేటాయిస్తాడనేది చూడాలి. దేవర-2 విషయంలో ఎన్టీఆర్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి.. కొరటాల అడుగులు పడే ఛాన్స్ ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



