బిగ్ ట్విస్ట్.. 'వార్-2'లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్!
on Aug 11, 2025

'వార్-2'తో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. బాలీవుడ్ ఫిల్మ్ కావడం, హృతిక్ కూడా ఉండటంతో.. ఎన్టీఆర్ రోల్ కి సంబంధించి మొదటి నుంచి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ విలన్ అని, కాదు 30-40 నిమిషాల పాటు కనిపించే స్పెషల్ రోల్ అని.. ఇలా రకరకాల ప్రచారాలు జరిగాయి. అయితే ఆ వార్తల్లో వాస్తవం లేదని.. హృతిక్, ఎన్టీఆర్ పాత్రలు పోటాపోటీగా ఉంటాయని ప్రచార చిత్రాలతో తేలిపోయింది. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సైతం మేకర్స్ ఇదే విషయాన్ని చెప్పారు. ఎన్టీఆర్, హృతిక్ పాత్రలు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నట్టు కాకుండా పోటాపోటీగా ఉంటాయని.. హీరో ఎవరు విలన్ ఎవరు? అనేది సినిమా చూసి ప్రేక్షకులే తేల్చాలని తెలిపారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ రోల్ కి సంబంధించి తాజాగా ఓ సర్ ప్రైజింగ్ న్యూస్ వినిపిస్తోంది. (War 2)
'వార్-2'లో ఎన్టీఆర్ హీరోనా విలనా? అంటూ ఇన్నిరోజులు చర్చ జరిగింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఇందులో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే ఈ సినిమాలో మేజర్ ట్విస్ట్ అని న్యూస్ వినిపిస్తోంది. ఇప్పటిదాకా 'వార్-2' అసలు స్టోరీని రివీల్ చేయలేదని మేకర్స్ తెలిపారు. మరోవైపు ఎన్టీఆర్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. సినిమాలో బిగ్ ట్విస్ట్ లు ఉన్నాయని అన్నాడు. దీంతో ఆ ట్విస్ట్ లలో ఒకటి ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
నిజానికి 'వార్-2'లో హృతిక్ కంటే ఎన్టీఆర్ స్క్రీన్ టైమే ఎక్కువ ఉంటుందట. డ్యూయల్ రోల్ లో ఎన్టీఆర్.. ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వబోతున్నాడని అంటున్నారు. ఒక రోల్ పాజిటివ్ గా ఉంటే, మరో రోల్ నెగటివ్ గా ఉంటుందని.. ఎన్టీఆర్ వర్సెస్ ఎన్టీఆర్ ఫైట్ కూడా చూడబోతున్నామని చెబుతున్నారు. అదే నిజమైతే 'వార్-2'ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరింత ఓన్ చేసుకుంటారు అనడంలో సందేహం లేదు. దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



