కాజోల్‌ని మోసం చేసిన రజనీకాంత్ కూతురు, అల్లుడు..?
on Jun 26, 2017

రజనీకాంత్ అల్లుడేంటి కాజోల్‌ని మోసం చేయడం ఏంటా అని అనుకుంటున్నారా..? దాని వెనుక ఉన్న కథాకమామీషు వేరే. ధనుష్ రీసెంట్‌గా నటించిన వీఐపీ-2కు ఆడియో, ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం నిన్న ముంబైలో జరిగింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ బ్యూటీ కాజోల్ హాజరై మాట్లాడుతూ..తనను ధనుష్, దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ మోసం చేశారని అనడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. వీఐపీ-2 చిత్రంలో తనకు తమిళ్ డైలాగ్స్ ఎక్కువగా ఉండవన్నారని కానీ వారు చెప్పినట్లుగా తమిళ్ డైలాగ్స్ తక్కువగా ఏమీ లేవని, వాళ్లిద్దరూ మంచి వాళ్లని నమ్మాను కానీ..చెడ్డ వాళ్లని నిరూపించారంటూ కాజోల్ సరదాగా అన్నారు. తనకు వేరే భాషలో మాట్లాడటం, నటించడం కష్టమనే అభిప్రాయం తనకు ఉండేదని..అయితే ఆ భయాన్ని పొగొట్టిన ధనుష్, సౌందర్యలకు ధన్యవాదాలన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



