భరత్ డ్రైవ్ చేసిన కారుపై ఎన్ని చలానాలో తెలుసా..?
on Jun 26, 2017

సినీనటుడు రవితేజ సోదరుడు భరత్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. మితీమిరిన వేగంతో ప్రయాణిస్తున్న భరత్ కారు రోడ్డుపై ఆగివున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఆ సమయంలో కారు గంటకు 145 కి.మీ వేగంలో ఉండటంతో దాని ధాటికి కారు దాదాపు సగం వరకు లారీ కిందకి చొచ్చుకుపోయి ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నప్పటికీ కారు లారీ కిందికి దూసుకుపోవడంతో అవి భరత్ ప్రాణాలను కాపాడలేకపోయాయి. ప్రమాదానికి గురైన కారుపై గతంలో అనేక ఈ-చలాన్లు నమోదైనట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. సాగర్ సోసైటీ, అన్నపూర్ణ చౌరస్తాల్లోని క్యారేజ్ వేల్లో రాంగ్ పార్కింగ్ చేసినందుకు ట్రాఫిక్ పోలీసులు చలానాలు జారీ చేశారు. ఇవే కాదు గతంలో మాదకద్రవ్యాలు, పోలీసులతో దురుసు ప్రవర్తన కేసులు భరత్‌పై నమోదయ్యాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



