కుమారి 21F లో బూతులేక్కువా?
on Nov 19, 2015
యంగ్ హీరో రాజ్ తరుణ్ - సుకుమార్ - రత్నవేలు - దేవి శ్రీ ప్రసాద్ వంటి ప్రముఖులు పనిచేసిన కుమారి 21F సినిమా రేపు విడుదలకాబోతుంది. అయితే ఈ సినిమాలో బూతు డైలాగులు ఎక్కువగా వున్నాయనే టాక్ మొదలైంది ఇండస్ట్రీలో, సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇవ్వడమే కాకుండా.. 20 డైలాగుల దగ్గర బీప్ సౌండ్ వేసిందట. సెన్సార్ వాళ్లు ఎక్కడెక్కడ అభ్యంతరం చెప్పారో, అన్ని చోట్లా చిత్రబృందం బీప్ సౌండ్ జోడించి, మళ్లీ సెన్సార్ వాళ్లకు ఈ సినిమా చూపించారు. చివరికి సెన్సార్ బోర్డు క్లియరెన్స్ కూడా ఇచ్చేసింది. హీబబ్ పటేల్ నటించిన ఈ సినిమా ట్రైలర్ పాటలు ఇప్పటికే యువతకు చేరువయ్యాయి. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫలితం రాబట్టబోతుందో రేపు తేలియనుంది.