నిహారికకి మెగా ఫ్యాన్స్ సపోర్ట్ ఉంటుందా?
on Nov 19, 2015
నాగబాబు కుమార్తె నిహారిక కథానాయికగా నటించబోతున్న 'ఒక మనసు' అనే సినిమా ఇటీవలే ప్రారంభమైంది. అయితే ఈ కార్యక్రమానికి మెగా హీరోలు ఎవరూ రాకపోవడం ఇండస్ట్రీ లో చర్చగా మారింది. నిహారిక ఎంట్రీ అసలు మెగా హీరోలకు నచ్చలేదని తెలుస్తోంది. మొదట నుంచి ఆమె సినీ ఎంట్రీ మెగా ఫ్యామిలీలో ఎవరికి ఇష్టం లేదట. `కావాలంటే టీవీ పోగ్రామ్స్ చేసుకోవచ్చుకదా` వారు వారించారట. నాగబాబు కూడా అయిష్టంగానే ఉన్నా.. కూతురు నటిస్తానని చెప్పడంతో సరే అన్నాడట. అందుకనే ఈ కార్యక్రమానికి మెగా హీరోలెవ్వరూ హాజరుకాలేదని ఇండస్ట్రీ వర్గాల టాక్. అందుకే.. ఈ సినిమా ఓపెనింగ్ గప్ చుప్ గా చేశారట. మరి మెగా అభిమానుల సపోర్ట్ అన్న నిహారికకు ఉంటుందా? లేదా? అన్నది బిలియన్ డాలర్ల ప్రశ్న!!