ప్రభాస్ క్యాంప్ లో రామ్ చరణ్ తేజ
on Nov 21, 2015
తని ఒరువన్ రీమేక్ లో నటించబోతున్న రామ్ చరణ్ తన తరువాతి సినిమా కోసం బయట నిర్మాణ సంస్థకు అవకాశం ఇవ్వడం ఇండస్ట్రీ లో టాక్ గా మారింది. వరుస హిట్లతో దూసుకుపోతున్న యు.వి.క్రియేషన్స్ బ్యానర్ లో చరణ్ ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. గోపిచంద్ కి జిల్ వంటి హిట్ మూవీని ఇచ్చిన రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందట. ఇది ప్రభాస్ స్నేహితులకు సంబంధించిన బ్యానర్ కావడం విశేషం. చరణ్ తని ఒరువన్ రీమేక్ తరువాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం వుందట. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని విశేషాలను మీ కోసం తీసుకురాబోతుంది తెలుగు వన్.