సమంత ఎందుకంత కష్టపడుతోంది?
on Nov 19, 2014
సమంత దూకుడు తెలుగునాట కాస్త తగ్గింది. ఆమె చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది. బన్నీ - త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలో సమంత కథానాయిక. అందులోనూ సోలో హీరోయిన్ కూడా కాదు. ఈ సినిమాలో మరో ఇద్దరితో పాటు కథానాయిక పోస్టు పంచుకొంటోంది. తెలుగునాట మరింతగా విజృంభించాలనో ఏమో... ఇప్పుడు తెగ కష్టపడుతోంది. గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకొంటోంది సమంత. అంతేకాదు... జిమ్‌లోనూ ప్రత్యేక శిక్షణ మొదలెట్టేసింది. నెల రోజుల పాటు జిమ్‌కి వెళ్లి బరువు ఇంకాస్త తగ్గాలని చూస్తోందట. అసలే అమ్మడు చాలా స్లిమ్. దానికి తోడు కసరత్తులు చేస్తోందంటే... భారీ ప్లానింగులే ఉన్నట్టుంది. అనుష్కలా లేడీ ఓరియెంటెడ్ సినిమా ఏమైనా ఫిక్సయ్యిందా?? అని టాలీవుడ్ వర్గాలు అనుమానిస్తున్నాయి. కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేయాలని సమంత ఆశపడుతోంది. అలాంటి కథలు వస్తే.. నటించడానికి రెడీ అని చాలాసార్లు చెప్పింది. బహుశా.. అలాంటి ఆఫర్ ఏదో వచ్చుంటుంది, అందుకే ఇంత కష్టపడుతోంది.. అని టాలీవుడ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మరి సమంత కసరత్తుల వెనుక ఉన్న మర్మమేమిటో...??