పూరి, బండ్ల గణేష్ మధ్య కోల్డ్ వార్ ..!
on Nov 19, 2014
బ్లాక్ బ్లాస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కి ప్రస్తుతం చాలా బ్యాడ్ టైమ్ నడుస్తోంది. తన కష్టాలన్నీ దూరం చేస్తాడని అనుకున్న గోవిందుడు అవి తీర్చకపోగా ఇంకా కొన్ని అప్పులు నెత్తిమీద వేశాడట. అలాగే పూరి-ఎన్టీఆర్ సినిమాకి ఎక్కువగా హైప్ క్రియేట్ చేసి టేబుల్ ప్రాఫిట్ పొందాలని ఆలోచిస్తున్న బండ్ల గణేష్ పూరి సహకరించడంలేదని ఇండస్ట్రీ టాక్. ఎన్టీఆర్ సినిమా రిలీజ్ కి రెండు నెలల లోపే సమయం వుంది కాబట్టి ఈలోగా కనీసం టీజర్ అన్న విడుదల చేయాలని గణేష్ అనుకున్నాడట. అయితే పూరి మాత్రం దానిని పట్టించుకోకుండా, సినిమాను త్వరగా ఫినిష్ చేయాలా అన్నదే ఆలోచిస్తున్నాడట. దీంతో బండ్ల గణేష్ అసలు సెట్స్ కి వెళ్లడం కూడా మానేశాడట. ఇప్పుడు సినిమా వ్యవహారాలు మొత్తం పూరి కనుసన్నలలో నడుస్తున్నాయట. సో ఎప్పుడు పూరి సై అంటారో అప్పుడు వరకు అభిమానులు టీజర్ కోసం వెయిట్ చేయాల్సిందే.