'గబ్బర్‌సింగ్'కి ఇద్దరు హీరోయిన్లు
on Nov 19, 2014
‘గోపాల గోపాల’ సినిమా షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్, ‘గబ్బర్‌సింగ్ 2’పైన దృష్టిపెట్టారట. ఇందులో ఆయన ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే మొదటి హీరోయిన్ గా అనీషాని ఎంపిక చేయగా, మరో హీరోయిన్ ని ఎంపిక చేసే పవన్ కళ్యాణ్ వున్నట్లు తెలుస్తోంది. అయితే సెకండ్ హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనే దానిపై కన్ఫ్యూజన్ లో వున్నారట. కొత్త అమ్మాయిని తీసుకోవాలా? లేక వున్నవారినే ఎంపిక చేయాలా అనేదానిపై చర్చలు జరుపుతున్నారట. అలాగే వచ్చే నెలలో ఈ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్ళాలనే పట్టుదలతో పవన్ వున్నారట. పవన్ క్లోజ్‌ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మించనున్న ఈ చిత్రాన్ని 'పవర్' డైరెక్టర్ బాబీ చేయనున్నాడు.