చిరంజీవికి దూరంగా..ఎన్టీఆర్ కు దగ్గరగా..!!
on Nov 21, 2015
అక్కినేని 'అఖిల్' సినిమా దెబ్బకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వినాయక్ కు జ్ఞానోదయమైందట. భారీగా హైప్ నెలకొన్న ప్రాజెక్ట్ ల జోలికి ఇక వెళ్ళకూడదని డిసైడ్ అయ్యాడట. తనకు కంఫర్టబుల్ అనిపించే హీరోల్లతోనే సినిమా తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాడట. అందుకే ఇప్పుడు రెస్ట్ అనే సాకుతో చిరంజీవి 150వ సినిమా విషయంలో కూడా వెనకడుగు వేశాడట. రెండు నెలలు గ్యాప్ తో ఫ్రెష్ అవ్వలని భావిస్తున్న వినాయక్.. ఈ సమయంలో తనకు ఇష్టమైన ఎన్టీఆర్ కోసం ఓ కథను సిద్దం చేయబోతున్నాడట. ఎన్టీఆర్ తో సినిమా అంటే ఎలాంటి టెన్షన్స్ వుండవని..తాను తిరిగి ఫామ్ లోకి రావాలంటే తారక్ అయితేనే కరెక్ట్ అని భావిస్తున్నాడట. మరి వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా వున్న ఎన్టీఆర్ వినాయక్ కథను ఓకే చేస్తాడో? లేదో? చూడాలి.