అనసూయ ఎన్టీఆర్ కి అందుకే నో చెప్పిందా?
on Jul 24, 2017
బిగ్ బాస్ షో మొదలవకముందు కంటెస్టెంట్స్ విషయానికి వచ్చేసరికి ప్రముఖంగా వినిపించిన పేరు యాంకర్ అనసూయ. ఆల్రెడీ టీవీ షోలు చేసింది, తన గ్లామర్ ఈ షో కి పెద్ద అసెట్ అవనుంది అని అందరూ భావించారు. కానీ, బిగ్ బాస్ మొదలయిన రోజు ఒక్కొక్క కంటెస్టెంట్ వస్తున్నకొలది అనసూయ పేరు ఇంకా రాలేదేంటి అని అందరూ ఎదురు చూసారు. కానీ, వాళ్ళ ఆశలు, దురాశలు చేస్తూ అనసూయ పేరు అసలు పిలవనే లేదు. అంటే, ఆమె షోలో లేదు అని అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. అయితే, అంతగా వినిపించిన పేరు ఎందుకు కనుమరుగయింది అనేది అందరి మదిలో మెదిలిన ధర్మ సందేహం. వాస్తవానికి, అనసూయ పేరు లిస్ట్ లో అందని సమాచారం. కానీ, తనకి రామ్ చరణ్ రంగస్థలం, మోహన్ బాబు, మదన్ కాంబినేషన్లో ఒక సినిమా ఉండడంతో ఎన్టీఆర్ షో కి నో చెప్పిందట.
ఒక రకంగా, అనసూయ నో చెప్పడం, షో నిర్వాహకులకు, బిగ్ బాస్ అభిమానులకి ఇబ్బందికర విషయమే. అయితే, టీవీ లో పాపులర్ అయిన అనసూయ ఈ మధ్య సినిమాల వైపు మొగ్గు ఎక్కువ చూపుతుంది, దానికి తోడు తనకి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఇవన్నీ కాకుండా, చరణ్, మోహన్ బాబు సినిమాలు చేయడానికి కమిట్ అయింది. సో, నో చెప్పడం తప్ప తనకి వేరే ఆప్షన్ లేకుండా పోయింది. చూద్దాం బిగ్ బాస్ 2 వరకు అయినా అనసూయ మనసు మార్చుకుంటుందేమో!