దేవసేనతో పెళ్లి ఫిక్స్?
on Oct 4, 2017
వరుసగా నాలుగు సినిమాల్లో కలిసి నటించడం... ఇద్దరూ మోస్ట్ ఎలిజిబుల్ బేచిలర్స్ అవ్వడం... ఇద్దరూ పెళ్లికి దూరంగా ఉండటం... ఇవన్నీ చూస్తుంటే ఎవరికైనా ఏమనిపిస్తుందీ... ‘వాళ్లనీ వీళ్లని ఎందుకూ... శుభ్రంగా మనిద్దరమే పెళ్లాడేసేద్దాం’ అని ఇద్దరూ అనుకున్నారా? అనే అనుమానం రాదూ...! మరి మామూలు జనాలకే అలా అనిపిస్తే... పొద్దున లేచినప్పట్నుంచీ సినిమాల రివ్యూలు రాసే ఉమర్ సింధూ కి అనిపించదా?. అనిపించేసింది.. అందుకే... ఏదోటి అనుకోని రాసేశాడు. ‘ప్రభాస్, అనుష్క పెళ్లి ఫిక్స్. డిసెంబర్ లోనే లగ్గం’ అని పోస్ట్ కూడా పెట్టేశాడు. అది ఆ కంటా ఈ కంటా పడీ... వైరల్ గా మారింది. ఛానల్స్ వాళ్లయితే.. వేసిదే వేస్తూ... చూపించిందే మళ్లీ చూపిస్తూ... తెగ హంగామా చేసేస్తున్నారు. ఇంకేముందీ... ప్రభాస్ కి చిర్రెత్తుకొచ్చింది. ‘ఏందీ రచ్చా...’ అంటూ అంతెత్తు లేచాడు. తన ఆంతరంగికుల చేత వివరణ ఇప్పించేశాడు. ‘ఈ వార్తల్లో అసలు నిజమే లేదు. ఒకవేళ నిజం ఉంటే.. దాన్ని దాచాల్సిన అవసరం ప్రభాస్ కీ లేదు, అనుష్కకీ లేదు. వాళ్ల సినిమాలతో వాళ్లు బిజీగా ఉన్నారు. అసలు అలాంటి ఆలోచనే వారిద్దరికీ లేదు. గాలి వార్తలు నమ్మొద్దు’ అని వివరణ ఇచ్చేశారు.
ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇక అనుష్క ‘బాగమతి’ చేస్తున్న విషయం తెలిసిందే.