భారతీయుడు-2 బడ్జెట్ ఎంతో తెలుసా..?
on Oct 2, 2017
దేశానికి స్వాతంత్ర్యం సాధించడానికి తెల్లవాళ్లతో పోరాడిన ఓ స్వాతంత్ర్య సమరయోధుడు..దేశంలో పెరిగిపోయిన అవినీతిపై జరిపిన పోరాటాన్ని కథాంశంగా తీసుకుని యూనివర్శిల్ స్టార్ కమల్‌హాసన్, ఇండియన్ స్పీల్‌బర్గ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు తెరకెక్కించారు. రెండు దశాబ్ధాల క్రితం వచ్చిన విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు రికార్డులను తిరగరాసింది. విమర్శకుల ప్రశంసలతో పాటు జాతీయ స్థాయిలో అనేక అవార్డుల్ని కైవసం చేసుకుంది. అలాంటి భారతీయుడికి సిక్వెల్ తీయాలని శంకర్-కమల్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు.
కానీ వారి ఉద్దేశ్యం కార్యరూపం దాల్చలేదు. అయితే ఇన్నాళ్లకు ఆ సమయం వచ్చింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ భారీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించబోతున్నారు. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ..సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా తయారు చేసుకున్న కథాంశంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నామని..మా బ్యానర్‌లో తెరకెక్కుతున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రమిదేనని..దీనిని 200 కోట్లతో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్నట్లు దిల్‌రాజు తెలిపారు. ప్రస్తుతం 2.0 చిత్రీకరణలో ఉన్న శంకర్..ఆ సినిమా పూర్తయిన వెంటనే భారతీయుడు-2ని పట్టాలెక్కిస్తారని చెప్పారు.