సత్యమూర్తికి నిత్య పడిపోయిందా?
on Mar 23, 2015
కథ నాకూ నచ్చాలి, పొట్టి బట్టలు వేసుకోను, సినిమాలో తనకూ ఇంపార్టెన్స్ ఇవ్వాలి....అంటూ లెక్కలేనన్ని కండిషన్స్ పెట్టిన నిత్య ఒక్క సారిగా రూటుమార్చిందట. గతంలో స్టార్ హీరోతో ఆఫర్స్ వరిస్తే...వామ్మో వద్దు...అంతా హీరోనే చూస్తారు-నన్ను చూడరంది. దీంతో ఏడాదికో సినిమాకే పరిమితమైంది. అయితే అలా మొదలైన జర్నీని ఇలానే సాగిస్తే కుదిరదనుకుందో ఏమో....ఒట్టు తీసి గట్టుమీద పెట్టేసింది. సన్నాఫ్ సత్యమూర్తితో చేయి కలిపి రెచ్చిపోయింది. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్ చూస్తే....నిత్య గతంలో కన్నా గ్లామర్ డోస్ పెంచిందనేది అర్థమవతోంది. నిన్నటి వరకూ మడికట్టుకు కూర్చున్న మలయాళ కుట్టి లేటెస్ట్ స్టిల్స్ చూసి ఆశ్చర్యపోతున్నారంతా. మరి అందం అభినయంతో పాటూ అందాలకు పరదాలు తొలగించక తప్పదని లేట్ గా తెలుసుకున్న నిత్యను సినీప్రియులు ఎలా రిసీవ్ చేసుకుంటారో? ఎక్కడికో వెళ్లిపోదామనుకుంటున్న సన్నాఫ్ సత్యమూర్తి నిత్య కెరీర్ ని ఎలాంటి మలుపు తిప్పుతుందో చూద్దాం.