అనుష్కకు రాఖీ సవతిగా మారిందా?
on Mar 23, 2015
హింట్ దొరికితే చెలరేగిపోతారన్నట్టు...ఒక్క యాడ్ తో పరిచమైన అనుష్క శర్మని విరాట్ కోహ్లీ ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. పైగా అనుష్క తన బౌండరీ దాటిపోకుండా ఫుల్ కేర్ తీసుకుంటున్నాడు. అటు నాటీ బ్యూటీ సైతం విరాటుడిపై మరో సుందరి కన్ను పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. పైగా పెళ్లికబురు త్వరలోనే తెలియజేస్తాం అని ఈ మధ్యే స్టేట్ మెంట్ కూడా ఇచ్చింది. కానీ మొగుడు-పెళ్లాం- ఓ దొంగోడు మాదిరిగా విరాట్-అనుష్క మధ్యలో రాఖీ వచ్చింది. విరాట్ ఐ లవ్ యూ అంటూ రాఖీ ఓపెన్ ఆఫర్ ఇచ్చేసింది. పైగా అనుష్క ఇప్పటివరకూ ఓపెన్ గా చెప్పలేదని తాను చెప్పానంటోంది. ఈ సంగతి తెలుసుకున్న అనుష్క...రాఖీపై కారాలు మిరియాలు నూరుతోందట. ఆ మధ్య విరాట్ తో యాడ్ లో ఇలియానా నటించినందుకే తెగ మధనపడిపోయింది. రాఖీ ఏకంగా ఐలవ్ యూ చెప్పడంతో ఇక తనూ తొందరపడకుంటే విరాటుడు జారిపోతాడేమో అనుకుంటోందట. ప్రస్తుతం వరల్డ్ కప్ లో బిజీగా ఉన్న విరాట్ ఆ సందడి నుంచి రాగానే పెళ్లి ముహూర్తం పెట్టించేయాలనే పట్టుదలతో ఉందట. పోనీ రాఖీ పుణ్యమా అని విరాట్-అనుష్క పెళ్లి త్వరగా జరుగుతుందేమో.