మెగా ఫ్యాన్స్ కి ఊహించని షాక్!
on Aug 19, 2025
.webp)
ప్రస్తుతం మెగా హీరోల టైం అంతగా బాలేదు. గత రెండేళ్లలో మెగా హీరోల నుంచి వచ్చిన సినిమాలన్నీ పరాజయం పాలయ్యాయి. దీంతో వారి తదుపరి సినిమాలపైనే మెగా అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది 'విశ్వంభర'తో చిరంజీవి, 'ఓజీ'తో పవన్ కళ్యాణ్ ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ సినిమాలతో మెగా ఫ్యామిలీ కమ్ బ్యాక్ ఇస్తుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో అభిమానులకు షాకిచ్చే న్యూస్ తెరపైకి వచ్చింది. 'విశ్వంభర' చిత్రం అసలు ఈ ఏడాది విడుదల కావడం లేదని ప్రచారం జరుగుతోంది. (Vishwambhara)
చిరంజీవి కథానాయకుడిగా 'బింబిసార' ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'విశ్వంభర'. ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ ని యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. మొదట్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే టీజర్ విడుదల తర్వాత వీఎఫ్ఎక్స్ వర్క్ ఆశించిన స్థాయిలో లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో మూవీ టీం.. వీఎఫ్ఎక్స్ పై ఎక్కువ టైం స్పెండ్ చేస్తోంది.
నిజానికి 2025 సంక్రాంతికే 'విశ్వంభర'ను విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ వీఎఫ్ఎక్స్ వర్క్, షూటింగ్ ఆలస్యం వంటి కారణాలతో సినిమా వాయిదా పడుతూ వస్తోంది. మొదట్లో ఈ వేసవికి వస్తుంది అన్నారు.. అది జరగలేదు. తర్వాత ఆగస్టు అన్నారు.. అదీ జరగలేదు. అక్టోబర్ అని ఈమధ్య బలంగా వినిపించింది. ఇప్పుడు అక్టోబర్ కాదు కదా.. అసలు ఈ ఏడాది విడుదల కావడమే కష్టమని న్యూస్ వినిపిస్తోంది. దానికి కారణం వీఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా పెండింగ్ ఉండటమేనని అంటున్నారు.
ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలోనూ చిరంజీవి ఓ సినిమా చేస్తున్నారు. దీనికి 'మన శంకర వరప్రసాద్ గారు' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ చిత్రం 2026 సంక్రాంతికి థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఇక 'విశ్వంభర' మూవీ 2026 వేసవిలో విడుదలయ్యే అవకాశముందని చెబుతున్నారు.
'విశ్వంభర' ఈ ఏడాది విడుదల కాదన్న వార్త మెగా అభిమానులకు నిరాశ కలిగించేదే. అయితే ఇదే ఏడాది సెప్టెంబర్ 25న పవన్ కళ్యాణ్ 'ఓజీ' విడుదల కానుంది. ఈ మూవీపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. మరి 'ఓజీ'తో మెగా అభిమానులు కోరుకుంటున్న భారీ సక్సెస్ లభిస్తుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



