బాలయ్యతో అసలు పరీక్ష ఎదుర్కోనున్న పూరి
on Mar 11, 2017
దర్శకుడు పూరి జగన్నాధ్ హిట్ కొట్టి చాలా కాలం అయింది. ఎవరికీ అంతు చిక్కని విషయం ఏంటంటే, వరుస ప్లాప్ లు తీస్తున్నా పూరి కి అవకాశాలు ఏమాత్రం తగ్గట్లేదు. బాలకృష్ణతో చేస్తున్న తన తదుపరి చిత్రం, ఈ మధ్యే ముహూర్తం కార్యక్రమాలు ముగించుకొని త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఒకప్పుడు మహేష్ బాబు కి చెప్పిన కథ కొన్ని మార్పులు చేర్పులు చేసి, బాలకృష్ణకి అనుగుణంగా తీర్చిదిద్దాడని ఫిలిం నగర్ టాక్. ఇదిలా ఉంటే, ఈ సినిమాతో పూరి జగన్నాధ్ కి అతి పెద్ద సవాల్ ఎదుర్కోవలసిన పరిస్థితి వచ్చింది.
నిర్మాతలు పూరి జగన్నాధ్ కి పరిమిత బడ్జెట్ ఇచ్చి ఆ ప్యాకేజీ లోనే సినిమా తీయాలని చెప్పారట. అంతే కాదు వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ లోనే పూరి రెమ్యూనరేషన్ కూడా సర్దుబాటు చేసుకోవాలి. అలాగని, చీప్ గా చుట్టేయకూడదు. ఫారిన్ లో సాంగ్స్, అవసరం కి తగ్గట్టు సెట్స్, ఈ విషయాల్లో కాంప్రమైజ్ కాకూడదని గట్టిగా చెప్పారట. ఇంతకీ వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ ఎంతో తెలుసా 25 కోట్లు. అయితే, బాలకృష్ణ రెమ్యూనరేషన్ వేరుగా ఇస్తున్నారు. అంతా కొత్త వాళ్ళని తీసుకుంటున్నాడు కాబట్టి, పూరి కి ఆర్టిస్టుల ఖర్చు చాలా వరకు తగ్గినట్టే. కానీ, పరిమిత బడ్జెట్ లో మంచి క్వాలిటీ సినిమా ఎలా తీస్తాడో చూడాలి. బుడ్డా హోగా తేరా బాప్ లాంటి బాలీవుడ్ సినిమాని కేవలం 10 కోట్లలో చుట్టేసిన పూరి కి 25 కోట్లలో సినిమా తీయడం పెద్ద ఇబ్బందికర విషయం ఏం కాకపోవచ్చు అని ట్రేడ్ పండిట్స్ చెబుతున్నారు.