ఇన్ని ఏళ్ళు ఆగింది రీమేక్ సినిమా చేయడానికా!
on Mar 11, 2017
GA2 , యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ వాళ్ళు సంయుక్తంగా ఒక కొత్త నిర్మాణ సంస్థ V4 ఈ మధ్యే ఏర్పాటు చేసి కొత్త వాళ్ళతో విలక్షణమైన సినిమాలు తీయనున్న విషయం విదితమే. వాళ్ళు తమ మొదటి చిత్రం గా ప్రభాకర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ తీస్తున్నారని సమాచారం.
ప్రభాకర్ అంటే వెంటనే గుర్తురాక పోవచ్చు కానీ, ఈటీవీ ప్రభాకర్ గా అయన బుల్లితెర ప్రేక్షకులకి సుపరిచితుడే. టీవీ రంగంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ప్రభాకర్ V4 సంస్థ వాళ్ళు తీస్తున్న చిత్రం తో త్వరలో వెండి తెరకి దర్శకుడిగా పరిచయం కానున్నాడు.
అయితే, ప్రభాకర్ కొన్ని రోజుల క్రితమో, లేదా కొన్ని నెలల క్రితమో మొదలు పెట్టిన ప్రయత్నం కాదు. గత మూడు, నాలుగు ఏళ్లుగా కథ సిద్ధం చేస్తూ నిర్మాతల సంకేతం కోసం వేచి చూశాడట. మొత్తానికి, వాళ్ళు అంగీకరించడంతో త్వరలో మూవీ పట్టాలకెక్కనుంది.
హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఆది, జబర్దస్త్ ఫేమ్ రష్మీ హీరో, హీరోయిన్ లుగా చేయనున్నారు. ఇంతకీ, ఇన్ని ఏళ్ళు కష్టపడింది సొంత కథకి అనుకుంటున్నారా. కాదండి బాబు, ఎదో హిట్ సినిమా రీమేక్ అంట. ఏదైతేనేం ప్రభాకర్ ఈ సినిమా ని తెలుగు ప్రేక్షకులు మెచ్చేలా చేస్తే అదే పదివేలు!