కాటమరాయుడు ఫస్ట్ ఆఫ్ ఎలా ఉంది??
on Mar 10, 2017
కాటమరాయుడు సినిమాకి ఇప్పుడిప్పుడే హైప్ పెరుగుతోంది. టీజర్‌కి అద్భుతమైన స్పందన రావడం, విడుదలైన రెండు పాటలూ యూ ట్యూబ్‌లో హల్ చల్ చేయడంతో పవన్ కల్యాణ్ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోతోంది. ఇటీవల పవన్ రషెష్ వేసుకొని చూసుకొన్నాడని తెలుస్తోంది. అనూప్ ఆర్.ఆర్ కూడా ఫినిష్ చేయడంతో ఫస్ట్ ఆఫ్ ఫినిష్ అయ్యిందని, శరత్ మరార్‌తో కలసి పవన్ ఫస్ట్ ఆఫ్ చూశాడని, అయితే.. నిరాశగా వెళ్లిపోయాడని తెలుస్తోంది.
ఫస్ట్ ఆఫ్ పవన్‌కి నచ్చలేదని, అందుకే మూడీగా ఉన్నాడని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే... పవన్ ఎప్పుడూ అంతేనని, ఎంత బాగా వచ్చినా... అంతే కామ్ గా ఉంటాడని, పవన్ సైలెంట్‌కి వేరే అర్థాలు తీయాల్సిన పని లేదని పవన్ కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... కాటరాయుడు ఫస్ట్ ఆఫ్ యావరేజ్ గా ఉందని, సెకండాఫ్‌పైనే హోప్స్ పెట్టుకోవాలని చెబుతున్నారు. సర్దార్ ఫ్లాప్‌తో కాస్త డిస్ట్రబ్ అయిన పవన్ ఫ్యాన్స్ హోప్స్ అన్నీ కాటమరాయుడుపైనే ఉన్నాయి. మరి.. డాలీ ఏం చేస్తాడో చూడాలి.