పవన్‌ని హీరోల౦తా కాపీ కొడుతున్నార్ట!
on Mar 16, 2015
ఈ మాట అన్నదెవరో కాదు.. సాక్ష్యాత్తూ దర్శకరత్న దాసరి నారాయణరావు. సన్నాఫ్ సత్యమూర్తిలో దాసరి నోట నుంచి పవన్ మాట వినిపించింది. నిజానికి ఆ సమయంలో పవన్ కల్యాణ్ లేడు. అసలు పవన్‌ప్రస్తావనే లేదు. కావాలనే గురువుగారు... పవన్ పేరు బయటకు తీశారు. ``ఎన్టీఆర్, ఏఎన్నార్ ల తరవాత తనకంటూ ఓ స్టైల్ చూపించిన నటుడు పవన్ కల్యాణ్`` అని చెప్పి.. అక్కడున్న అభిమానులను ఉర్రూతలూగించారు. పవన్‌నే మిగిలిన హీరోలు కాపీ కొడుతున్నారంటూ ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు. సడన్‌గా గురువుగారికి పవన్‌పై ఇంత ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఎందుకంటారా... దాసరి నిర్మాతగా పవన్ ఓ సినిమాలో నటిస్తున్నాడు కదా. అందుకు. తన హీరోని తాను కాకపోతే ఎవరు పొగుడుతారు. అందుకే గురువుగారు కూడా పొగిడేశారు. మరి దాసరి వ్యాఖ్యలకు మిగిలిన హీరోలు ఏమాత్రం నొచ్చుకొన్నారో గానీ.. పవన్ ఫ్యాన్స్ మాత్రం పొంగిపోయారు.