హృతిక్ కొత్త గాళ్‌ఫ్రెండ్ ఇదివరకు మరొకరితో సహజీవనంలో ఉంది!
on Feb 2, 2022

బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ ఇటీవల సబా అజాద్ అనే అమ్మాయితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ కనిపించి, వార్తల్లో నిలిచాడు. ఆమెతో అతను రిలేషన్‌షిప్‌లో ఉన్నాడా, లేదా అని తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ఆత్రుతతో ఎదురుచూశారు. సబాతో హృతిక్ డిన్నర్ డేట్ టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారడమే కాకుండా, ఆ ఇద్దరూ చేయీ చేయీ కలిపి పట్టుకున్న ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. Also read: ఒకే సినిమాలో నాగ్, టబు!
అయితే లేటెస్ట్‌గా తెలిసిన విషయమేమంటే సబా ఇదివరకు నసీరుద్దీన్ షా కొడుకు ఇమాద్‌తో రిలేషన్‌షిప్‌లో ఉంది. 2013 నుంచి తాము సహజీవనంలో ఉన్నట్లు ఇమాద్ గతంలో ధ్రువీకరించాడు కూడా. ఏడేళ్ల అనుబంధం తర్వాత వ్యక్తిగత కారణాలతో 2020లో ఆ ఇద్దరూ విడిపోయారు. అందిన సమాచారం ప్రకారం కొన్ని నెలలుగా సబాతో రిలేషన్‌షిప్‌లో ఉన్న హృతిక్.. ఇంతదాకా ఆ విషయం బయటకు పొక్కకుండా చూసుకున్నాడు. గత నెలలో ఆ ఇద్దరూ గోవాలో కొద్ది రోజులు గడిపి వచ్చినట్లుగా కూడా తెలిసింది. Also read: 'చిట్టి'తో షూట్ షురూ చేసిన 'రావణాసుర'!
వర్క్ విషయానికి వస్తే, దిల్ కబడ్డీ, ముఝ్‌సే ఫ్రాండ్‌షిప్ కరోగే, రాకెట్ బాయ్స్ తదితర చిత్రాల్లో కనిపించింది సబా. చివరగా ఆమె నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'ఫీల్స్ లైక్ ఇష్క్'లో కనిపించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



