Home

»

Latest News

ఒకే సినిమాలో నాగ్, టబు!

Feb 02, 2022

హిట్ పెయిర్ కింగ్ నాగార్జున - ఎవ‌ర్ గ్రీన్ బ్యూటీ ట‌బు.. ఒకే సినిమాలో న‌టించ‌బోతున్నారా? అవున‌న్న‌దే కోలీవుడ్ టాక్.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. `నేర్కొండ పార్వై`, `వ‌లిమై` చిత్రాల అనంత‌రం హెచ్. వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో కోలీవుడ్ స్టార్ అజిత్ ముచ్చ‌ట‌గా మూడో సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ క‌పూర్ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. ఇదిలా ఉంటే.. ఇందులో ట‌బు ఓ ముఖ్య పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేకాదు.. మాలీవుడ్ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ కూడా ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తార‌ని వినిపించింది.

Also Read: 'రామారావు'తో చిందేయనున్న ఇలియానా!

లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. ఇందులో నాగార్జున కూడా న‌టించ‌బోతున్నార‌ట‌. త‌న‌ది పోలీస్ క‌మీష‌న‌ర్ పాత్ర‌ని అంటున్నారు. అదే గ‌నుక నిజ‌మైతే.. చాలాకాలం త‌రువాత ఒకే సినిమాలో నాగ్, టబు సంద‌డి చేయ‌బోతున్న‌ట్లే. త్వ‌ర‌లోనే అజిత్ - వినోద్ థ‌ర్డ్ జాయింట్ వెంచ‌ర్ లో నాగ్, ట‌బు పాత్ర‌ల‌పై స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

Also  Read: కార్తి, సామ్.. ఓ బైలింగ్వ‌ల్ మూవీ!?

కాగా, పాతికేళ్ళ క్రితం విడుద‌లైన సంచ‌ల‌న చిత్రం `నిన్నే పెళ్లాడ‌తా`లో నాగ్, టబు జంట తెలుగువారిని విశేషంగా ఆక‌ట్టుకుంది. ఆ సినిమాకి ముందు `సిసింద్రీ`లో ``ఆటాడుకుందాం.. రా!`` అనే గీతంలో వారిద్ద‌రు ఆడిపాడారు. అలాగే చివ‌రి సారిగా `ఆవిడా మా ఆవిడే`లో జంట‌గా మ‌రోసారి క‌నువిందు చేశారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com