'విక్రమ్ వేద'లో వేద ఫస్ట్ లుక్ ఇదే!
on Jan 10, 2022

బాలీవుడ్ స్టార్ యాక్టర్ హృతిక్ రోషన్ ఈరోజు (జనవరి 10) 48వ బర్త్‌డే జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా 'విక్రమ్ వేద' మూవీలో ఆయన ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. తమిళంలో మాధవన్, విజయ్ సేతుపతి టైటిల్ రోల్స్ పోషించగా సూపర్ హిట్టయిన 'విక్రమ్ వేద'కు ఇది రీమేక్. ఒరిజినల్‌లో విజయ్ సేతుపతి చేసిన వేద క్యారెక్టర్‌ను హిందీ రీమేక్‌లో హృతిక్ చేస్తున్నాడు. విక్రమ్ రోల్‌ను సైఫ్ అలీఖాన్ పోషిస్తున్నాడు. ఫస్ట్ లుక్‌లో బ్లాక్ కుర్తా ధరించిన హృతిక్.. పొడవుగా పెంచిన గడ్డం, బ్లాక్ గాగుల్స్‌తో రస్టిక్‌గా కనిపిస్తున్నాడు. ముఖం, మెడ ముందు భాగంలో రక్తపు చారికలు కనిపిస్తున్నాయి.
Also read: "నన్ను పెళ్లాడతావా?" అమీషాకు ప్రపోజ్ చేసిన కాంగ్రెస్ లీడర్ తనయుడు!
2021 అక్టోబర్‌లో హృతిక్ షూటింగ్ ప్రారంభించాడు. 'విక్రమ్ వేద'లో హృతిక్ ఫస్ట్ లుక్‌ను షేర్ చేసిన దర్శక ద్వయం పుష్కర్-గాయత్రి, "హృతిక్‌కు జన్మదిన శుభాకాంక్షలు! నీతో పనిచేయడం మైండ్‌బ్లోయింగ్‌గా అనిపించింది. Cheers to a great year ahead! 'విక్రమ్ వేద'లో వేద ఫస్ట్ లుక్‌ను ప్రెజెంట్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. 2022 సెప్టెంబర్ 30 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతుంది. #VedhaFirstLook #HappyBirthdayHrithikRoshan (sic)." అని రాసుకొచ్చారు.
Also read: హిందీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న 'పుష్ప'.. రూ. 60 కోట్లను క్రాస్ చేసిన ఐకాన్ స్టార్!
ఒరిజినల్ ఫిల్మ్‌ను డైరెక్ట్ చేసింది కూడా వారే. సైఫ్ అలీఖాన్, హృతిక్ రోషన్ టైటిల్ రోల్స్ చేస్తున్న 'విక్రమ్ వేద' హిందీ రీమేక్‌లో రాధికా ఆప్టే, రోహిత్ సరాఫ్, యోగితా బిహాని కీలక పాత్రలు చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



