మార్చి 4న చిరు నివాసంలో అల్లువారి పెళ్ళిసందడి
on Feb 23, 2011
యువహీరో అల్లు అర్జున్ వివాహం స్నేహారేడ్డితో మార్చి ఆరో తారీఖున జరగనుంది, ఈ పెళ్ళికి టాలీవుడ్, బాలీవుడ్, కొలీవుడ్ సినీ తారలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో మార్చి 4వ తారీఖున అల్లు అర్జున్ ను పెళ్ళికొడుకును చేయనున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ కుటుంబం అందరూ అల్లు అర్జున్ ను “వరుడు”గా తీర్చిదిద్దడంలో బిజీగా ఉన్నారు. ఈ ఫంక్షన్ కి టాలీఫుడ్ సినీ తారలతో పాటు రాజకీయ నాయకులు కూడా ఈ వేడుకలో పాల్గొనడానికి విచ్చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ పెళ్ళి మాత్రం మార్చి 6వ తారీఖు రాత్రి 10.33 నిముషాలకు హైదరాబాద్ లోని హైటెక్స్ జరగనుంది. ఇప్పటికే అల్లు అర్జున్ శుభలేఖలు బంధుమిత్రులు అందకున్నారు.
ఇక ఈ వివాహానికి బాలీవుడ్ నుంచి అమీర్‌ఖాన్ కూడా రానున్నారు. అమీర్‌తో అల్లు అరవింద్ గజని చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి ఈ గజినితో అరవింద్ కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. అందుకే అల్లు అర్జున్ వివాహానికి అమీర్‌ఖాన్ ఎంతో ఇష్టంగా రానున్నాడని సమాచారం. ఒకపక్క అల్లుఅర్జున్ వివాహానికి సమయం ఆసన్నమవ్వడంతో పాటు మరోపక్క అల్లు అర్జున్ నటించిన చిత్రం బద్రినాథ్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ప్రమోషన్ అల్లు అర్జున్ వివాహం తరువాత మొదలవుతుందని సమాచారం. వరుడిగా “వరుడు’’ చిత్రంలో నటించిన అల్లు అర్జున్ నిజీవితంలో వరుడిగా మారుతుంటే చూడాలని, వరుడు చిత్రంలో ఐదు రోజుల పెళ్ళి వేడుకలు నిజజీవితంలో కూడా జరుగుతాయా అని చాలా మంది అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



