మన భారత స్వతంత్ర జెండా!(69వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా)
మన భారత స్వతంత్ర జెండా!
(69వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా)
మన స్వతంత్ర భారత జెండా !
ఎగిరే వినువీధుల నిండా !
మువ్వన్నెల ముద్దుల జెండ !
మురిసే వసంతాలు నిండ !
స్వాతంత్ర్యపు ఊపిరి నిండుగ
ఆగష్టిది మనకిల పండుగ !
శాంతి సౌఖ్యాలహింసలు మెండుగ
కాంతి నింపు నీ పండుగ !
మన స్వతంత్ర భారత జెండా !!
పింగళి కూర్చినదీ దండ !
గాంధీజీ కలలే పండ !
భరతమ్మకు మువ్వన్నె జెండా
భరతావనికి అండదండ !
మాటల మతాల కూర్చి పేర్చిన
సమైక్య భారత జెండా !
మన స్వతంత్ర భారత జెండా !!
ఎవరే మనినా ?...
ఏదేమైనా ?...
మేమేమైనా ? ...
మాసర్వస్వమ్మీ జెండ !
ఇది భారత త్యాగ నికేతనం !
ఇది భారత ధార్మిక కేతనం !!
ఇది భరత పవిత్ర సుకేతనం !!!
నవ భారత సమైక్య కేతనం !!!!
మన స్వతంత్ర భారత జెండా !
ఎగిరే విను వీధుల నిండా !!.....
గీత రచన :
- నల్లాన్ చక్రవర్తుల వేంకట రంగనాథ్ .
