Facebook Twitter
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి 100వ ప్రచురణ ఆవిష్కరణ మహోత్సవం-సాదర ఆహ్వానం

గౌ. భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి 100వ ప్రచురణ ఆవిష్కరణ మహోత్సవం - మీకు మా సాదర ఆహ్వానం (అక్టోబర్ 24, 2021, ఆదివారం సాయంత్రం 6:00pm) …అంతర్జాలం లో....

మిత్రులారా,

తెలుగు భాషా సాహిత్యాలకి మాత్రమే పెద్ద పీట వేస్తూ 1994 లో అమెరికాలో స్థాపించబడిన లాభాపేక్ష లేని వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థ అమెరికా దేశంలో తెలుగు తెలుగు పుస్తక ప్రచురణలు 1995 లో మొదలుపెట్టింది. అప్పుడు ప్రచురించిన మా మొదటి గ్రంధం “అమెరికా తెలుగు కథానిక -మొదటి సంకలనం”. అప్పటి నుంచీ క్రమబద్ధంగా సాగుతున్న మా తెలుగు పుస్తక ప్రచురణల ప్రస్థానం లో ఇప్పుడు మా 100వ ప్రచురణ “7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సభా విశేష సంచిక” (Proceedings of the 7th World Telugu Literary Symposium) విడుదలకి సిధ్ధంగా ఉంది.

గత 27 సంవత్సరాలగా ప్రపంచవ్యాప్తంగా వందలాది తెలుగు సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడమే కాక భారత దేశం ఎల్లలు దాటి, విదేశాలలో అత్యధిక సంఖ్యలో తెలుగు సాహిత్య ప్రచురణలు చేసిన వంగూరి ఫౌండేషన్ వారి నిరంతర సాహిత్య కృషిని గుర్తిస్తూ, ఈ 100వ ప్రచురణని  ఒక మైలు రాయిగా భావించి గౌ. భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ఈ గ్రంధాన్ని ఆవిష్కరించడానికి ఉత్సాహంగా అంగీకరించారు.

ఈ  100వ గ్రంధావిష్కరణ మహోత్సవం అంతర్జాలంలో ఈ వారాంతం..అనగా ఆదివారం (అక్టోబర్ 24, 2021) భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6:00 pm కి జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని వీక్షించి, ఆనందించి, స్పందించమని మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మీరు వీక్షించే You Tube & Face Book links ఈ క్రింద ఇచ్చాం.

100వ గ్రంధావిష్కరణ మహోత్సవం

October 24, 2021 6:00 PM (India Time)

Singapore: 8:30 pm; Melborurne, Australia: 11:30 pm; London, UK: 1:30 pm;

Houston, TX, USA: 7:30 AM CST

You Tube Links

https://youtube.com/channel/UCX9tl92zikUSpHp0MuNTiLQ

https://youtube.com/c/SriSamskruthikaKalasaradhi

https://youtube.com/channel/UCT3B1RMkhHjAjfpTJxDJY9w

Face Book Live Links

https://m.facebook.com/వంగూరి-ఫౌండేషన్-ఆఫ్-అమెరికా-100332915167722/

https://www.facebook.com/SriSamskrutikaKalasaradhi/

https://www.facebook.com/Telugumalli/

 

 

అంతే కాదు....ఆ తర్వాత మరో రెండు గంటలు....

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి 100 వ ప్రచురణగా ఇది ఒక ఎత్తు అయితే..ఈ గ్రంధం సరిగ్గా ఏడాది క్రితం ..అక్టోబర్ 10-11, 2020 తేదీలలో జరిగిన “7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సభా విశేష సంచిక” (Proceedings of the 7th World Telugu Literary Symposium”)  కావడం మరొక ఎత్తు.

అంతర్జాలంలో జరిగిన ఆనాటి 7వ ప్రపంచ సాహితీ సదస్సు మా సంస్థ, శ్రీ సాంస్కృతిక కళా సారధి (సింగపూర్). తెలుగు మల్లి (మెల్ బర్న్, ఆస్త్ఱేలియా), ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు సమాఖ్య (యునైటెడ్ కి౦గ్డమ్),

దక్షిణ ఆఫ్రికా తెలుగు సాహిత్య వేదిక (జొహానెస్ బర్గ్) మొదలైన సంస్థల సహకారంతో, సుమారు 250 మంది సాహితీ వేత్తలు 36 గంటలు నిర్విరామంగా వినిపించిన తమ సాహీత్య ప్రసంగాలని అన్నింటినీ ఈ సభా విశేష సంచికలో సుమారు 520 పేజీలలొ ఎంతో ఆకర్షణీయంగా పౌందు పరచ బడిన ఈ అపురూపమైన గ్రంధం. అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంటుంది.

ఈ సందర్భంగా గత ఏడాది జరిగిన 7వ ప్రపంచ సాహితీ సదస్సులో పాల్గొన్న వక్తలు, వేదిక నిర్వాహకులూ, సాంకేతిక నిపుణులూ అందరూ మళ్ళీ ఈ అంతర్జాల వేదిక మీద కలుసుకుని ఆ నాటి తమ జ్ఞాపకాలని నెమరు వేసుకుంటున్నారు. మా బృందం అందరి తరఫునా ఈ సరదా సమావేశాన్ని వీక్షించమని ఆహ్వానిస్తున్నాం.

ఈ ఆత్మీయ సమావేశం భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 24, 2021, సాయంత్రం 6:30 – 8:30 దాకా కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి కూడా పై లింక్స్ వర్తిస్తాయి.

 

జతపరిచిన మా సాదర ఆహ్వానాన్ని మన్నించి, భారత ఉపరాష్ట్రపతి మాన్యులు శ్ర్రీ వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా జరుగుతున్న మా 100వ పుస్తక ఆవిష్కరణ మహోత్సవాన్నీ, తర్వాత జరిగే 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ఆత్మీయ సమావేశాన్నీ తప్పకుఁడా చూసి ఆనందిస్తారు కదూ!

                                                            భవదీయుడు.
                                                            వంగూరి చిట్టెన్ రాజు, Houston, TX.
                                                            వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (హ్యూస్టన్, హైదరాబాద్)
                                                            E-mail: vangurifoundation@gmail.com
                                                            Phone (USA): 832 594 9054