TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
- జి.వి అమరేశ్వరరావు
పార్ట్ - 4
అంటూ పక్కనే ఉన్న ప్లాస్క్ ఓపెన్ చేసి తనే స్వయంగా రెండు కప్పులోకి ఛాయ్ నింపాడు. తర్వాత స్వయంగా టేబుల్ మాట ఒకటి ఆమె ముందు దానిమీద ఛాయ్ కప్పు పెట్టాడు.
ఆమె అంతకముందు చిన్న చిన్న జ్వరాలకి, పడిశాలకి చాలామంది డాక్టర్ల దగ్గరకి వెళ్ళింది. వాళ్ళలో చాలామంది పేషెంట్లు ను కసురుకుంటూనో, పేషెంట్ చెప్పే సిస్టమ్స్ పూర్తగా వినకుండానే ప్రిస్పిక్షన్ రాసేసి ఆ తరవాత రావాల్సిన పేషెంట్ కోసం కాలింగ్ బెల్ ప్రెస్ చేస్తారు. అంతా మెకానికల్ కమర్షియల్ అనిపిస్తుంది.
వాళ్ళందరికీ భిన్నంగా కనిపిస్తున్నాడు ఇంద్రమిత్ర. అతడి ప్రెండ్లీ ప్రవర్తన ఆమెలో వున్న బెరుకుతనాన్ని పోగొట్టింది. ఆమెకి ఇంద్రమిత్ర ఓ డాక్టర్ గా కాక ఒక స్నేహితుడిగా, శ్రేయోభిలాషిగా, అత్మీయుడిగా కనిపించసాగాడు.
ఒక్క శిశిరతోనే కాదు_ తమ మానసిక సమస్యలు చెప్పకోవడానికి తన దగ్గరకి వచ్చే ప్రతి పేషెంట్ తోనూ ఇంద్రమిత్ర ఇదే విధంగా ప్రవర్తిస్తాడు.
"ఛాయ్ లో పంచదార సరిపోయిందా ఇంకాస్త వేయమంటారా?" అంటూ అడిగాడు ఇంద్రమిత్ర.
చిక్కటి పాలల్లో యాలుకులు వేసి తయారుచేసి ఛాయ్ ఘుమ ఘుమ వసల్ని వెలువరిస్తుంది.
మెల్లగా నవ్వింది ఆమె.
"అక్కర్లేదు_ సరిపోయింది."
ఆమెలో కొత్తతనం పూర్తిగా పోయింది అని నిర్దారించుకున్నక అడిగాడు ఇంద్రమిత్ర.
"నన్ను ఒక డాక్టర్ గా చూడవద్దు. మీ స్నేహితుడిగా భావించండి. నేను మీకు చేతనయినంత సహాయం చేస్తాను."
అమె గోళ్ళరంగు వైపు చూస్తూ చెప్పింది.
"నాకింకా పెళ్ళికాలేదు. మామ్మా నన్న నాకు పెళ్ళి సంభందాలు చూద్దాం అనుకుంటున్నారు. అయితే నాకున్న అలవాటు భవిష్యత్తు లో ఏమయినా సమస్యల్ల్ని తీసుకు వస్తుందేమో అని భయపడుతున్నారు.
ఇంద్రమిత్ర చెప్పమన్నట్టు చూశాడు.
"నిజానికి చాలా రోజుల వరకు నా అలవాటును మా అమ్మా నాన్నా వాళ్ళు గమనించలేదు. ఒకసారి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినపుడు నా కజిన్ సిస్టర్ గమనించింది.
క్షణం ఆగి చెప్పసాగింది శిశిర.
"నేను రోజుకు కనీసం పది పన్నెండుసార్లు స్నానం చేస్తాను. చేతులు, కాళ్ళు, ముఖం కడిగిన దాన్ని కదిగినట్టే వుంటాను.మొదట్లో రెండు మూడుసార్లు స్నానం చేసెదాన్ని. కాని అలవాటు పది పన్నెండు సార్లకి పెరిగింది. ఈ అలవాటు నుంచి కంట్రోల్ చేసుకోవడానికి ఎంత ప్రయత్నించినా నాకు సాద్యం కావడంలేదు. పదే పదే చేతులు, కళ్ళు కడుక్కోవటం, అనేకసార్లు స్నానం చేయటం చూసిన మా బంధువులు నాకు పిచ్చిపట్టింది అనుకుంటున్నారు. కాని మిగిలిన విషయాల్లో నేను మామూలు గానే వుంటాను.
మొన్న నేను అమ్మా నాన్నలతో కల్సి సినిమాకు వ్వేల్లాను. సరిగ్గా అరగంట తర్వాత నాకు అసహనంగా అనిపించసాగింది. ఏదో అదృశ్యశక్తి పదవాటి వేళ్ళతో నా కఠం నులుముతున్న అనుభూతి. నేను ఇక సినిమా హాల్లో క్షణం కూడా వుండలేకపోయాను మా అమ్మా నాన్నకు చెప్పకుండా ఇంటికి వచ్చి స్నానం చేశాను. అప్పటివరకూ నన్నుపట్టి పిడిస్తున్నా అదృశ్యరాక్షసి కబంధ హస్తాలనుంచి విముక్తి చెందిన ఫీలింగ్ వెంటనే కలిగింది.మళ్ళీ రెండడుగుల తర్వాత మళ్ళీ అసహనంగా, దుఃఖంగా, కోపంగా అనిపిస్తూ వుంటుంది మళ్ళీ స్నానం చేస్తేకాని నా మనస్సు శాంతించదు. చివరకి నా అలవాటువల్ల బయటకు వెళ్ళడం మానుకున్నాను. కాలేజీ చదువుకు స్వస్తి చెప్పాను. డిగ్రీ చదువు అర్దాంతరంగా ఆపేశాను. మా బంధువులు, స్నేహితులు శ్రేయోభలాషులు అందరూ నాకు పిచ్చి పట్టిందనుకున్నారు."
క్షణం ఆగింది శిశిర.
ఆమెకు ఇంద్రమిత్ర మంచి నీళ్ళాగ్లాసు అందించాడు. ఒక్కగుక్కలో గ్లాసు ఖాళీ చేసి తిరిగి చెప్పసాగింది
"నాకు పెళ్ళి కావలసిన చెల్లెళ్ళు మరో ఇద్దరు వున్నారు. నాకు పిచ్చి అని తెలిస్తే మా చేల్లేళ్ళు క్కూడా పెళ్ళిళ్ళు కావు. అయినా నేను నా అలవాటు మార్చుకోలేకపోయాను. రెండు మూడుసార్లు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించాను.
అని చేతుల్లోముఖం పెట్టుకుంది శిశిర.
ఎగిరిపడుతున్న ఆమె భుజాల్నిబట్టి శిశిర రోదిస్తున్నట్టు గ్రహించాడు ఇంద్రమిత్ర.
అతడికి శిశిర సమస్య అర్ధం అయింది. ఆమె చెప్పడం మిగిమ్చే సమయానికి ఆమె మానసిక స్థితికూడా అర్ధం చేసుకున్న ఇంద్రమిత్ర అనునయంగా చెప్పాడు.
"బాగా ఎగ్జయిట్ అయ్యారు. కాసేపు బల్లమీద పడుకుని రిలాక్స్ అవ్వండి."
శిశిర పక్కనే ఉన్న బల్ల వేపు మూవ్ అయింది.
ఇంద్రమిత్ర తాను డెయిలీ మిర్రర్ దినపత్రికకు వ్రాసే వ్యాసాల్లో హిప్నటిక్ షిడిషన్స్ గురించి కూడా వివరంగా తెలియచేశాడు.
ఒక వ్యక్తిని హిప్నటిక్ సజిషన్ లోకి వెళ్ళాల్సిన అవసరం వున్నపుడు ఆ వ్యక్తి సైక్రియాటిస్ట్ కి పూర్తిగా సహకరించాలి. హిప్నాటిజంలోకి వేళ్ళనవసరంలేదు.అని అ వ్యక్తి భావించినపుడు సైకియాస్టిక్ ఇచ్చే సజెషన్స్ వల్ల ప్రయోజనం వుండదు. అ వ్యక్తి ట్రాన్స్ లోకి వెళ్ళడం జరగదు.
శిశిర తాను పూర్తిగా సహకరించటానికి మానసికంగా సిద్దపడిన తర్వాతే ఆమె ఇంద్రమిత్రకు కలిసింది. అతడు వ్రాసే వ్యాసాలు చదివి వుండడంవల్ల తనకు అతడు సజెషన్స్ ద్వారా ట్రాన్స్ లోకి పంపబోతూన్నాడనే విషయం అర్ధం చేసుకుంది శిశిర.
ఆమెను ట్రాన్స్ లోకి పంపడానికి ఇంద్రమిత్రకు రెండు నిమిషాలు కంటే ఎక్కువ సమయం పట్టలేదు.
మానసికంగా ఇంద్రమిత్రఅదేనంలోకి వెళ్ళిన శిశిర తన కధ చెప్పసాగింది.
* * * *