TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
వలచి వచ్చిన వనిత
-వసుంధర
పార్ట్ - 3
చాలా తమాషా అయిన సందర్భం ఏర్పడినట్లు నాకు తోచింది. తీవ్రంగా ఆలోచనలో పడ్డాను.
శ్రీధరబాబు ఉంటున్న వాటా మొత్తంరెండు పెద్ద గదులు ఒక చిన్న వంటిల్లు. ఎవరైనా ఒక రిద్దరు అతిధులుగా వస్తే ఆదరించడానికి సరిపడ్డ నివాసమే అతనిది. అయితే అతను లేని సందర్భంలో అతని చెల్లెలు వస్తే మేమిద్దరం అదే వాటాలో ఉండడం కష్టమే మరి.
ఇంతకీ ఆమెను స్టేషన్ కి వెళ్ళి రిసీవ్ చేసుకునేదెలా? ఆమెను నేనెన్నడూ చూసి ఉండలేదు. ఆమె తనకు తానుగా సరాసరి గదికి రాగలదో లేదో తెలియదు. ఈ పరిస్ధితుల్లో నేనేం చేయాల్సి ఉంటుంది?
ఏంచేయ దల్చుకున్నా బాగా ఆలోచించాకనే ఒక నిర్ణయానికి రావలసిఉంటుంది. ఎందుకంటే ఇది శ్రీధరబాబు చెల్లెలితో వ్యవహారం!
నేను మళ్ళీ చొక్కా వేసుకొని టెలిగ్రామ్ చేత్తో పట్టుకుని తలుపులు తీసుకుని గది బయటకు వచ్చాను. వెదక బోయిన తీగెకాలికి తగిలి నట్లుగా నిన్ననే నాకు పరిచయమైన ఇంటాయన కనపడ్డాడు. నన్నూ నా చేతిలోని టెలిగ్రామ్ నూ చూస్తూ ఆయన గాబరాగా-"ఏమిటీ మళ్ళీ మరో టెలిగ్రామా?" అన్నాడు. ఆయన మాట వినగానే నాకూ గాబరా కలిగింది. శ్రీధరబాబుకి గాని కొంప తీసి ఇంకో టెలిగ్రామ్ వచ్చి ఉండలేదుకదా_అని కంగారు పడ్డాను.
ఇంటాయన నా చేతులోంచి లాక్కొన్న విధంగా టెలిగ్రామ్ తీసుకుని చదివి తెలిగ్గ్గా నిటూర్చి-"హమ్మయ్య-" అనిఒక్కనిముషం ఆగి-"పొద్దున్నే నాకు ఓ టెలిగ్రామ్ వచ్చింది__మ ఆవిడకు సుఖప్రసవమై కొడుకును కన్నదని. అంత మంచి వార్త వచ్చిన తర్వాత మరో టెలిగ్రామ్ వెంటనే వచ్చిందంటే గాబరా కలగడం సహజమే కదండీ! ఏమయితేనేం-మీతో సరదాగా ఓ రెండు రోజులు కాల క్షేపం చేయడానికి లేకుండా నేను మా అత్తారింటికి వెళ్ళ వలసి వస్తోంది__" అని హఠాత్తుగా ఏదో గుర్తు కొచ్చిన వాడిలా_"ఇంతకీ మీరేదో చెప్పాలని వచ్చినట్లున్నారు!" అన్నాడు.
నిన్ననే ఇంటాయన అన్నాడు నన్నుచూసి__ "నేనూ ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను కాబట్టి ఓ రోజు సరదాగా మనమంతా అడ్డాటలో కూర్చుందాం___" అని అది గుర్తుకొచ్చి మన మెప్పుడేం చేయబోయేదీ మనకే తెలియదుగదా అనుకున్నాను. నేను వచ్చిన పని ఇప్పుడీయనకు చెప్పి ప్రయోజనంలేదు. శ్రీధరబాబు లేని సమయంలో అతని చెల్లెలు రాబోతున్న సందర్భం- తెలియనివ్వడం అనవసరమని తోచింది. అందుకే కాస్త మాట మార్చి__"అబ్బే ఏమీలేదు. ఉబుసుపోక వచ్చాను. అంతా నా పాదం మంచిదంటారు. చూశారా, నేను మీ ఇంట్లో కాలుపెట్టాను మీకు కొడుకు పుట్టిన వార్త అందింది. కంగ్రాట్యూలేషన్స్!" అన్నాను.
"థాంక్సండీ__" అన్నాడాయన.
"ఇంతకీ ప్రయాణమంటున్నారు_ఎన్నాళ్ళేమిటి మకాం!"
"మూడు వారాలు!" అన్నాడాయన.
"హతోస్మి!" అనుకున్నాను.
3
ఇంటాయన తెల్లవారు ఝామునే లేచి వెళ్ళి పోయాడు. నేను ఉదయం పదిగంటల ప్రాంతంలో నా ఆఫీసు పనిమీద బయటకు వెళ్ళాను పార్వతికోసం స్టేషన్ కు వెళ్ళదల్చు కోలేదు కాబట్టి- బయటకు వెళ్ళబోయేముందు__తాళం కప్పుకు ఓ ఉత్తరం రాసి పెట్టాను. అందులో శ్రీధరబాబు ఊళ్ళోలేని సంగతి రాసి__నేను ఇంటికి వచ్చే టైము కూడా ఇచ్చాను.
హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ అక్కడకు సుమారు నాలుగు గంటలకు వస్తుంది. నా ఆపీసు పని కూడా నాలుగు గంటలకే అయింది. స్టేషన్ కు ఫోన్ చేసి__ట్రయిన్ లేట్ ఏమో కనుక్కున్నాను. ఆ రోజు కరెక్ట్ టైమ్ కే వచ్చిందట. నేను టైము గణించు కున్నాను.
పార్వతి స్టేషన్లోదిగి కాసేపు అన్న గురించి ఎదురు చూస్తుంది. ఆ తర్వాత నెమ్మదిగా ఆలోచించి మరి అన్నరాడని గ్రహించడానికి కనీసం ఒక అరగంటైనా పడుతుంది. అప్పుడామె విసుక్కుంటూ ఏరిక్షాలోనో గదికి బయల్దేరుతుంది. ఇదంతాజరిగి ఆమె గదికిచేరుకునేసరికి సుమారు అయిదవుతుంది. ఉదయం చీటీలో అయిదున్నరకు వస్తానని రాసినా ఓపావుగంట ముందుగా వెళ్ళడం మంచిదని తోచింది.
నాలెక్క తప్పలేదు. నేను వెళ్ళేసరికి ఇంటివరండాలో__ఒక యువతి కూర్చునిఉంది. ఆ ఇంటికి అదేవరండా, అదేవీధరుగు అనిచెప్పవచు. ఎదురుగుమ్మం ఇంటాయనది ప్రక్కగుమ్మం శ్రీధరబాబుది!
ఆ యువతిని చూస్తూనే నేను తెల్లబోయాను. ఆమె అందంలో అప్సరస. చూసిన క్షణంలో అంతకు మించి మరే ఆలోచనా బుర్రలో కదలలేదు.
నేనూ ఆఇంటి వరండాలో అడుగిడుబోతూండడం చూసి ఆమె అసహనంగా నావంకచూసి__ "మీరేనా అన్నయ్యస్నేహితుడు?" అనడిగింది.
తియ్యని ఆ పలుకులు వింటుకూడా- సమాధానమెలా ఇవ్వగలిగానో నాకు ఆశ్చర్యమే మరి "శ్రీధరబాబు చెల్లెలు మీరే నన్నమాట!" అన్నాను.
"చెల్లెలు అనేఅనుకోండి" అనిఆమె అదొకలానవ్వింది "ఇంతకీ అన్నయ్య ఎప్పుడువస్తాడు?"
"రెండు లేక మూడు రోజులు"
"బాస్ రే!" అందామె చిరాకును వ్యక్తపరుస్తూ.
"ముందుగదిలోకిపదండి!" అన్నాను నేనుముందడుగువేసి.
తలుపు తాళం తీశాను ఆమెలోపలకు ప్రవేశించింది చిన్న సూట్ కేసుతో.
"ఇటువంటి పరిస్ధితి వస్తుందని బాబు ఊహించలేదు. లేకపోతే నీగురించి ఏదోమంచి ఏర్పాటుచేసి ఉండేవాడు. టెలిగ్రాం కూడా అతను లేని సమయంలో వచ్చింది. మరి ఇప్పుడింకఒక్కటే ఉపాయం. మీరిక్కడహాయిగా మకాం పెట్టుకొండి. మీ అవసరాలన్నీ నేను చూస్తూంటాను. రాత్రిళ్ళునే నెక్కడేనా పడుకునే ఏర్పాటు చేసుకుంటాను" అన్నాను.
ఆమె తమాషాగానవ్వి__"మొత్తానికిమగవాణ్ణనిపించారు చచ్చి ప్రయాణం చేసి నేనువస్తే మీరు రాత్రిగురించి ఆలోచిస్తునారు"__అంది.
దెబ్బతిన్నాను __అయినా లోంగకుండా__ "నిజంచెప్పాలంటే మీరు ప్రయాణంచేసి వచ్చేరనిపించడంలేదు. పువ్వులా ఇంతపిసరు నలగకుండా వచ్చారు"__అన్నాను.
ఆమెముఖంలో రవంత గర్వంలాంటిది కనబడింది___"బాగానే ఉంది మీ పొగడ్త! కానీ పెళ్ళికాని ఆడది నలిగిన పువ్వులా ఉంటుందని ఎలాగనుకున్నారో నాకు మాత్రం తెలియడంలేదు"__
మళ్ళీదెబ్బతిన్నాను. ఘటికురాలే శ్రీధరబాబు చెల్లెలు అనుకున్నాను. ఈమెదగ్గర నాకింత పిసరుకూడా బెరుకు అనిపించడంలేదు. ఈ జీగా మాట్లాడటం కష్టం. ప్రస్తుతం మీగురించి నేనేం చేయవలసిఉందో చెప్పితే అలామసులుకుంటాను." అన్నాను వినయంగా.
"దారికి వచ్చారు. అయితే ఈగదికినేను యజమానిని. నా అన్నయ్యకు అతిధికాబట్టి మీరు నాకూ అతిధే అవుతారు. అతిధి మర్యాదలు చేయడం నాకు బాగాతెలుసు. ముందు మీరలా కుర్చీలో కూర్చోండి. అతిదుల్ని నిలబెట్టి మాట్లాడకూడదు"___ అందామె చనువుగా.
"నేనువెళ్ళి కుర్చీలో కూర్చున్నాను. ఆమెకదిలి శ్రీధరబాబు మంచంమీద కూర్చుంది."__ ఇప్పుడు మనంకాసేపు ఏవైనా కబుర్లు చెప్పుకుందాం"___అందామె అదోకలా వళ్ళు విరుచుకుంటూ.
ఉండిండీ ఉండిండీ ప్రక్కదారులు పడుతున్న మనసును నిలదొక్కుకుంటూ__"కబుర్లా కథలుకూడానా"? అనడిగాను.
"కథలే అనుకోండి__కాకపోతే కథలాంటి కబుర్లు".......