Facebook Twitter
వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వండి

వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వండి

- ఇల్లిందల పద్మా శ్రీనివాస్

 

పిల్లలూ ? పిల్లలు అంతే గుర్తు వచ్చింది. ఇప్పుడు పిల్లలూ ఎక్కడ ఉన్నారు ఉంటే స్కూల్ లో లేదా కంప్యూటర్ టి.వి ల ముందు ఇంతకు ముందు మా  రోజుల్లో పిల్లలు అయితే సాయంత్రం అయితే చాలు వీధుల్లో పిల్లలి అందరూ  కలసి ఆడుకుంటూ ఉండేవారు. రాత్రిళ్ళు తాతయ్య, నానమ్మ చెప్పే కథలు వింటూ నిద్రపోయేవారు.ఇప్పుడు పిల్లలకు ఆ తీరికా లేదు, ఆ కోరికా తీరదు. ఎందుకంటే ఎప్పుడూ చదువుతో వాళ్ళు బిజీ , ఉద్యోగాలతో తల్లితండ్రులు బిజీ. వాళ్ళని ఒళ్ళోకి తీసుకుని  వాళ్ళ ఆనందాన్ని షేర్ చేసుకునే టైం లేదు ఎప్పుడూ ర్యాంక్ స్కూల్లో రుద్దుతారు. ఇంటికి వచ్చాక ట్యూషన్. ఇక వాళ్ళకి ఆదుకునే టైం ఏది..

పిల్లలు సాయంత్రం పూట ఆడుకుంటుంటే వాళ్ళ మేధ శక్తి పెరుగుతుంది.వాళ్ళ ఒంటికి వ్యాయామం ఉంటుంది. నలుగురితో ఎలా కలిసి మెలిసి ఉండాలన్నది. వాళ్ళకు అలవాటు అవుతుంది. పొద్దున్నే లేవగానే ఉరుకులు పరుగులు అంత బరువున్న స్కూల్ బ్యాగ్ భుజాన వేసుకుని వెళ్లి సాయంత్రం ఇంటికి అలసిపోయిరాగానే మళ్ళీ ట్యూషన్ ఇదేనా పిల్లల జీవితం వాళ్ళ బాల్యం ఇలా ముగిసి పోవలిసిందేనా చదివించండి కాని వాళ్ళకి ఆటకి గంటయినా టైం ఇవ్వండి. చిన్న వయసులో పదే పదే చదివిస్తే వాళ్ళకి వచ్చింది కూడా మరచిపోయే అవకాశం ఉంది. వాళ్ళ చిన్ని బాధను అర్ధం చేసుకునే వాళ్ళ వయసుకు తగిన చదువును చెప్పండి.

మూడు సంవత్సరాలు రాగానే వాణ్ణి స్కూల్ లో వేసి వాడి వయసుకు మించిన భారాన్నివాడి మీద  మోపుతున్నారు, ఆ వయసులో  వాడి చిన్ని బుర్రలో ఎన్నో ఆలోచనలు, ఈ రోజు ఏం ఆడుకోవాలని కాని కాని ఆటలకి టైం లేదన్న సంగతి వాడికి తెలియదు. వాళ్ళ బాల్యంలో వాళ్ళ ఆనందాలను మనం తుంచేస్తే వాళ్ళ కోరికలు ఎప్పుడూ తీరుతాయి. ఏమి తెలియని పసి వాళ్ళు వాళ్ళ ఆనందాన్ని దోచుకునే హక్కు తల్లి దండ్రులగా మనకు లేదు. తల్లిదండ్రుల తప్పుకూడా ఎంత   మాత్రమూ లేదు ఎందుకంటే పిల్లల మధ్య కాంపిటిషన్ ఎక్కువ అయింది. తమ పిల్లలకు ర్యాంక్  రాకపోతే వాడు వాల్లందరిలో ఎక్కడ తక్కువ అవుతాడో అని ఫీలింగ్. ఆ ఫీలింగ్ విడిచి  తల్లి తండ్రులు కూడా వాళ్ళ భావితకి వారధులుకండి . వాళ్ళని కూడా సాయత్రం వేళ ప్రకృతిలో స్వేచ్చగా విహరించనీయండి. స్వచ్ఛమైన గాలిని  ఆస్వాదించనీయండి.చదువుతో పాటు ఆటలకి కూడా టైం ఇవ్వండి.