Facebook Twitter
నోరు నవ్వు ఏం చెబుతున్నాయి

నోరు నవ్వు ఏం చెబుతున్నాయి

పార్ట్ - 2

-స్వప్న కంఠంనేని

అరుణారుణ ముఖం :

కోపం వచ్చినపుడు లేక అవమానించబడ్డప్పుడు మనిషి మొహం ఎర్రగా  కందిపోతుంది. ఇందుకు కారణం ఆ సమయంలో శరీరంలో రక్తం మొహంలోకి తన్నుకు రావడం! ఆ సమయాన సమీపంలో ఉన్నవాళ్లు మీద అతను  పెట్రేగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇలా మాటిమాటికి మొహం కందిపోయే పురుషుడిని స్త్రీ భరించడం కష్టమే.
ఆమె అసహనవతి కాకపోతే వాళ్ళ మధ్య రణ నాదాలు చెలరేగిపోయే ప్రమాదం ఉంది..

దృడ చిత్తుడు :

చుబుకం ముందుకు జరిగి,దవడ నరాలు బిగుసుకుని  ఉండి, పెదిమల కొనలు కొండికి వంపు తిరిగి ఉంటే ఆ వ్యక్తి దృడ చిత్తుడుగా తీసుకొనవచ్చు. ముస్సోలినీ,రిచర్డ్ నిక్సిన్ ఈ కోవకు చెందినవాళ్ళే.ఇలాంటి పురుషులకు దర్పం ఎక్కువ. ఇతరులతో ఏకీభవించక తను మాటే నెగ్గాలని పంతం ఎక్కువ ఒకవేళ ఎప్పుడన్నా ఏకీభవించినట్లు కనిపించక కనిపించినా అది తను పంతం నెగ్గటానికి అదే నాటకం మాత్రమే అది!
అణకువగా ఉండే స్త్రీలు ఇలాంటి పురుషుల వద్ద రాణించ గలుగుతారు !

నునుసిగ్గులవాడు :

పెదాలు కళ్ళ చివర చిరు నవ్వులు దాగి,చేపలు కొద్దిగా గులాబీ రంగుకు మారి (కెంపులై) నునుసిగ్గులు ప్రదర్శించే పురుషుడు శృంగార రాయుడై, స్త్రీ చెప్పే సజెషన్స్ తల వగ్గే వాడై వుంటాడు.

పాలిపోయిన మొహం :


 మోహంలో రక్తం ఇంకిపోయి తెల్లగా వ్యక్తి పూర్తిగా భయపడిపోయిన వాడై వుండాలి. లేక తీవ్ర కోపంతో ఉన్నవాడైనా అయి వుండాలి.ఆ సమయాన అతడి మొహం లో రక్తం శరీర కండరాల లోకి పరుగుదీసి అతడిని పారిపోవడనికో, పోరాడడానికో సిద్దం చేసి ఉంటుంది.
ఇలాంటి  స్థితిలో ఉన్న వ్యక్తితో  హేతుబద్దంగా  వాదనలు పెట్టుకోబూనడం శుద్ధ అవివేకం. పక్కకు తప్పుకు పోవడం  మంచిది.

ముక్కుపుటాలెగరేసేవాడు :

చిన్న చిన్న విషయాలకే త్వరగా ఉద్రిక్తత చెందే పురుషుడు మనిషి మాటి మాటికి ముక్కుపుటాలను ఎగరేస్తుంటాడు. రౌద్రనికి సూచన ఇది.తీవ్రమైన ఉద్వేగ జీవి ఇతను. తరచు మూడీగా ఉంటాడు. తన భావాలను దాచుకోవడానికి ఏమాత్రం ప్రయత్నించడు. పైగా వాటిని ఎదుటి వాళ్ళకు తెలియచేయటానికి కూడా సిద్దం గా ఉంటాడు. ఇలాంటి వ్యక్తి ఉండి  ఉండి గభాల్న కోపంతో మండిపోతాడు. అంతలోనే చల్లారిపోతాడు.

వంకరలు తిరిగే మొహం :

తనలో భావాలను అణచుకుని నెర్వస్ గా అణచుకుని ఉండే మనిషి మొహం వంకర్లు తిరిగినట్లుగా కనిపిస్తుంది. మొహంలో ని ప్రతీ భాగమూ ఎంతో కొంత అసలు రూపాన్ని మార్చుకున్నట్లుగా కనిపిస్తుంది. న్యూరోటిక్  మనిషి అతను.అతని అవసరాలు, కోర్కెలు తీర్చడానికి సిద్దపడితే తప్ప ఏ స్త్రీ అతని జోలికి పోకుండా ఉండటమే మంచిది.
పురుషుడు తన చుట్టూ తిరుగుతూన్నపుడు విడివిడిగా అతని  మొహంలో ఒక్కో భాగాన్ని పరిశీలించడం కాకుండా  జమిలిగా అతను తన చూపుల్ని ఏ దిక్కుకి ప్రసరిస్తున్నాడు , కనుబొమ్మల్ని ఎలా కదిలిస్తున్నాడు, ఏ సందర్భంలో ఎంత త్వరగా నవ్వగలుగుతున్నాడు, అతని పెదిమల పొజిషన్ ఎలా ఉంది లాంటివన్నీ నిశితంగా గమనించి అతని గురించి ఒక అభిప్రాయానికి రావడం మంచిది.