Facebook Twitter
వస్త్రధారణ ఏం చెబుతుంది.

వస్త్రధారణ ఏం చెబుతుంది?

(కట్టే బట్టను చూసి కట్టూ ' బొట్టు'కు ఎన్నుకో )

- స్వప్న కంఠంనేని

దుస్తుల్ని మనుషులు తయారు చేస్తారు. కాని దుస్తులు మనుషుల్ని తయారు చేస్తాయన్న సంగతి చాలా మందికి తెలియదు!
మనం ఒక మనిషిని చూడగానే అతను ధరించిన దుస్తులు అతనెలాంటి వాడో మనకు చెప్పేస్తాయి. అతని  వ్యక్తిత్వం ఎలాంటిదో, ప్రేమికుడుగా అతని లక్షణాలేమిటో లాంటి విషయాలను కూడా తెలియజేస్తాయి.

( వింటున్నావా వినయవతి )

తన స్వంత స్టయిల్ లో దుస్తుల్ని ట్రిమ్ గా ధరించే వ్యక్తీ ఎప్పుడు అమ్మాయిలకు ఆకర్షణీయంగా కనిపిస్తాడు స్వతహా అతను అందగాడు కాకపోయినా గానీ !

 అదే రకంగా ఒక వ్యక్తీ ఎంత అందగాడు అయినా కూడా సరయిన దుస్తుల్ని ధరించపోతే అమ్మాయిల్ని ఆకట్టుకోలేడు. అమ్మాయిలకు కూడా అంత అందంగా ఉండే అతను తనను ఎందుకో ఆకర్షించలేక పోతున్నాడో అర్ధంకాదు !
యువకులకు సంబందించిన ఒక అదృష్టమేమిటంటే యువతులంతా ఒకే రకమైన వస్త్రధారణ సమ్మోహితులు కాకపోవడం.
ఒక అమ్మాయికి ఒంటికి అంటిపెట్టుకుని ఉండే బిగుతు దుస్తులు ధరించిన  యువకుడు ఆకర్షణీయంగా కనిపించకపోతే, మరో అమ్మాయికి వదులుగా ఉండే బాగీ ప్యాంటు, షర్ట్ ధరించిన యువకుడు ఆకర్షణీయంగా కనిపించవచ్చు.
మరో స్త్రీ కి కవుల్ని స్పురణకు  తెచ్చే బిగుతు పైజామా, వదులు లాల్చీ (రాజేష్ఖన్నా స్టయిల్) ధరించిన యువకుడు అందంగా కనిపించవచ్చు.

చిందరవందరగా పడేసి ఉంటే....

ఒక యువతి తను ప్రేమించే లేక తనను ప్రేమిస్తున్నాను అంటూ తన చుట్టూ తిరిగే యువకుడి గదికి వెళ్ళిందనుకుందాం. అప్పుడామెకు అతని దుస్తులు గదిలో ఈ మూల నేల మీద పడేసి ఒకటి,మంచం మీద ఒకటి, కుర్చికి తగిలించి ఒకటి ఇలా అడ్డంగా చిందరవందరగా కనిపిస్తాయి. అప్పుడతని గురించి ఆమె ఎలాంటి అభిప్రాయానికి రావచ్చు?

 అతను యధాలాపంగా ఉండే మనిషి ! కొంచం బాధ్యతారహితంగానే ఉండేవాడు కావచ్చు. కానీ జీవితం పట్ల ఆశక్తి కలవాడు , జీవితాన్ని తేలికగా తీసుకునే వ్యక్తీ అయివుంటాడు కూడా!

అతి నీట్ గా ఉంటే ..

దుస్తుల్ని అతి నీట్ గా ఉంచే  యువకుడు  అంటే హంగర్ కి తగిలించే వాటిని హంగర్ కూ తగిలించి, విదిచేసిన వాటిని ఓ పక్క ప్రత్యేకంగా ఉండే చెక్క పెట్టెల్లో కనిపించకుండా పడేసి ఉంచి చూపరులకు నీట్నెస్ ప్రదర్శించే వాడు.మొండి మనిషి కావచ్చు అతని అభిప్రాయాన్ని మార్చటంగాని, అతడి హృదయానికి చేరువ కావటం గానీ కొంత కష్టసాధ్యమైన విషయమే.సదా సిద్దంగా ఉంచితే...చొక్కా గుండిలు  ఊడిపోవటం , చిరుగులు లాటి వేమీ లేకుండా తనకు దుస్తుల్ని వేసుకోవటానికి ఎప్పుడు సిద్దంగా ఇస్త్రీ మడతలతో రెడీగా ఉంచితే..ఆ వ్యక్తీ భాద్యతల్ని స్వీకరించేవాడూ కమిట్మెంట్స్ కి కట్టుబడి ఉండేవాడు అయివుంటాడు.

దుస్తుల్ని తనకు తాను రిపేర్ చేసుకునేవాడు...

దుస్తుల్ని రిపేర్ చేయమంటూ ఇంట్లో వాళ్ళకో , టైలర్కో అప్పజెప్పే మనిషయితే అతను తన పరిధిలేమిటో తెలిసినవడయివుంటాడు. అవసరమైనపుడు నిపుణుల సలహాలు తీసుకోవడానికి ఏమాత్రం సందేహించాడు.
అలాకాకుండా తనకు తానూ కుట్టుకోవడమే చేసేవాడు అయితే తన గురించి తాను జాగ్రత్తలు తీసుకోగలిగే స్వతంత్ర వ్యక్తిత్వం  కలిగినవాడు అయి వుంటాడు. అతడిని పెళ్ళాడిన స్త్రీ కొంత స్వతంత్యాన్ని ప్రదర్శించినా గాని ఏ మాత్రం అభ్యంతరం పెట్టడు. డ్రెస్ ఎన్నాళ్ళపాటు వేస్తాడు... ఒక డ్రస్సును వూరికే రోజులు తరబడి వేయకుండా ఒక రోజు రెండు  రోజులు మాత్రం ధరించి ఆ వెంటనే ఇస్త్రీకి పంపేవాడు స్త్రీ కి తను నప్పుతాడా లేదా అని తెగ తాపత్రయ పడేవాడు అయి వుంటాడు అలా కాకుండా ఒకసారి ఇస్త్రీ చేసిన దుస్తుల్ని మైలపడ్డాయో లేదో చూసుకోకుండా రోజుల తరబడి వేసుకునే యువకుడు తన గురించి తాను పట్టించుకోనివాడు, స్త్రీల అభిప్రాయాలకు ప్రాదాన్యత ఇవ్వనివాడు. అంతే కాదు ఆమెకు అందంగా కనిపిస్తే ఏమిటి కనిపించకపోతే ఏమిటి అన్న ధోరణిలోను  ఉంటాడు.

దుస్తుల అమరిక :
వార్డ్ రోబ్ లో అతను దుస్తుల్ని ఎలా వేలడదీస్తాడు :

దుస్తుల్ని ఒక పద్దతి ప్రకారం నిలవ ఉంచుకునే వ్యక్తీ బరువు బాధ్యతల్ని స్వికరించ గల్గేవాడయి ఉంటాడు . జీవితం విషయంలోనూ ప్రేమ విషయంలోనూ నినాదాన్ని పాటించే వాడయి వుంటాడు.

అల కాక దుస్తుల్ని ఒక పద్దతి లేకుండా చేతికి కందిన చోట్ల దేన్నీ పడితే దాన్ని హాంగ్ చేసి ఉంచేవాడు ప్రేమ విషయంలోఒక నిలకడ లేకుండా తన చిత్తం వచ్చినట్లుగా అమ్మాయిలతో ఆడుకునే వాడయి ఉంటాడు.