Facebook Twitter
నోరు నవ్వు ఏం చెబుతున్నాయి

నోరు నవ్వు ఏం చెబుతున్నాయి

- స్వప్న కంఠంనేని

(ఎలా లవ్వుతాడో తెలుసుకోవాలంటే
ఎలా నవ్వుతాడో  చూడాలమ్మాయి ! )

అందమైన అమ్మాయి,
కలవారి అమ్మాయి,
సంపాదించే స్త్రీ
వయ్యారాల వొంపుల కుప్ప,
సుతారాల సుందరాంగి


ఇలాంటి స్త్రీలను చూసినపుడు పురుషులు ప్రేమలో పడాలనే వెంపర్లటలో  పడతారు. నానారకాల నాటకాలు మొదలెడతారు. అయితే తన చుట్టూ తిరిగే అలాంటి పురుషులలో  తనకు సరిజోడి ఎవరో ఆమె ఎలా తెలుసుకోగలదు. అతను తనను ఉల్లాస పరుస్తాడా,ఉదాసీనత చిత్తుడా, సౌమ్యవంతుడా, డాన్ జాన్ వారసుడా ?మోహిత పరిచే నరసచిత్తుడా లేక బిగుసుకుని ఉండే జడాత్ముడా ? ఈ విషయాన్నీ తెలుసుకోవడం ఎలా ?

ఒక మనిషి నవ్వే తీరు, అతని నోటి కండరాల విన్యాసం, పెదాల భంగిమలు, ఇలాంటివన్నీ అతడు సంభాషించే సమయంలో  అతడి గురించి రహస్య సమాచారాన్ని బయట పెడతాయి. అలాంటి వాటిని  కూపీ లాగటం ద్వారా స్త్రీ అతడేలాంటివాడో తనపట్ల అతనికేలాంటి దృక్పథముందో తెలుసుకోవచ్చు.

విశాల లాస్యం :


ఒక వ్యక్తిలో  మంచి హ్యూమర్ ఉండి అతడు పెదాల్ని ఈ చివరి నుండి ఆ చివరి వరకు లాగి నోరంత తెరచి మనస్పూర్తిగా నవ్వుతుంటే అతనున్న గదంతా  వెలిగిపోతున్నట్లవుతుంది.

* తన సంతోషాన్ని ఇతరులకు పంచటానికి సంకోచించని మనిషి  అయి వుంటాడు అతడు.
* గారెలోని చిల్లును పట్టించుకోకుండా మిగతా ముక్కవైపు ఆశగా ఆశగా చూసే ఆశావాది అతను.
* తన ఆనందాన్ని ఎదుటి వాళ్ళకు కూడా పంచాలనే  తాపత్రయం గల పెద్ద మనిషి.!
* అతడి ఎన్నుకునే స్త్రీ తన జీవితాన్ని ఒక నవ్వుల పువ్వుల  పండగగ చేసుకుంటుంది. అయితే ఆమె  కొంచం సెన్సిటివ్ అయితే  ఒకోసారి ఆమెకు అతను 

బోరు కూడా కొట్టవచ్చు.

అతడిలో అది ఆమె క్షమించ దగ్గ అవలస్కనమే కూడా

సీరియస్ సీజరు :

కొందరు మోహం మీద ఎప్పుడూ సీరియస్నెస్ చోటుచేసుకుని సదా బిగదీసుకున్నట్లుగా  ఉంటారు. అలాంటి పురుషుడి గురించి స్త్రీ  ప్రారంభంలో తప్పు 

అంచనా వేసుకున్నాకాలక్రమాన అతనిలో అసలు రహస్యాన్ని పసిగట్టగలుగుతుంది.

* తనలో భావాల్ని ఇతరులకు కనిపించకుండా దాచుకునే పెద్దమనిషి అయి వుంటాడు.
* సామాన్యంగా  అతను  తనకు తాను  సంతోషంగా ఉండే పెద్ద మనిషి కాడు. అందుకనే అతనిలో సంబందాలు అతనితో జీవితాన్ని పంచుకునే స్త్రీకి కూడా ఏమంత సంతోషందాయకంగా ఉండవు.

పెదిమల్ని పట్టించుకోరూ :

నవ్వు చెప్పే రహస్యాలే కాకుండా ఎక్కువ సంధర్బాలలో అతని పెదిమలు అలవాటు పూర్వకంగా సాగే భంగిమలు కూడా అతని  గురించిన రహస్యాలు చెబుతుంటాయి.

* ఉదాహరణకు ఒక వ్యక్తి కాకుండా ఎక్కువ తరచుగా తన కింది పెదిమను కోరుకుంటూ ఉంటాడనుకోండి.
* అతను నెర్వస్ ఉన్న మనిషి అయి ఉంటాడు. తాను చెప్పాలనుకుంటున్న విషయాన్ని చెప్పకుండా లోలోపల అణచి పెట్టుకున్నవాడై వుంటాడు.

వచ్చేవారం పెదిమలకు సంబందించిన మరికొన్ని వివిధ భంగిలమలను పరిశీలించుదాం ....


సశేషం....