Facebook Twitter
చేయూతనిద్దాం

చేయూతనిద్దాం

- ఇల్లిందల పద్మా శ్రీనివాస్

ఏదైనా వైకల్యంతో పిల్లలు పుట్టగానే చాలా మంది తల్లి దండ్రులు వాళ్ళని అనాథలుగా వదిలి వెళ్ళిపోతారు.కాని ఆ పిల్లలకు వైకల్యం లేదు. అలా వదిలి వెళ్ళిన తల్లిదండ్రులే వైకల్యం ఉన్నవాళ్లు.. అలా ఉన్న పిల్లలను ఇంకా ఎంతో  ప్రేమతో తల్లి దండ్రులు పెంచాలి. వాళ్ళకు కూడా ఏదో ఒక విజయాన్ని సాధించాలని వుంటుంది. ఆ విజయ సాధనకు తల్లి దండ్రులే తొలి గురువులు కావాలి.వాళ్ళను బాగా చదివించి వాళ్ళకు నచ్చిన ఏదో ఒక  దారిలో సాగనివ్వాలి. ఎప్పుడూ పొరపాటున కూడా వాళ్ళదగ్గర 'నువ్వు ఇలా పుట్టావు' అన్న మాటలు రానివ్వకూడదు. అంగవైకల్యం ఉన్న వారి దగ్గర తల్లి దండ్రులు కాని వాళ్ళను పెంచే అనాధ ఆశ్రమాలు కాని ఎంతో ప్రేమతో వ్యవహరించాలి.వాళ్ళకు వైకల్యం  గుర్తు రాకుండా వాళ్ళు క్రుంగిపోకుండా అంగవైకల్యం ఉన్న వాళ్ళు సాధించిన విజయాలను గురించి చెప్పాలి. చాలా చోట్ల చూస్తూ ఉంటాం. ఏదో ఒక వైకల్యం ఉన్న వాళ్ళను పిల్లలు  కూడా అడుకున్నపుడు ఆటపట్టించి వేధిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఆ పిల్లల తల్లితండ్రులు పిల్లలకు చెప్పాలి ఏరోజు అంగవైకల్యం ఉన్నపిల్లలను చిన్న చూపు చూడకూడదని, వాళ్ళను కూడా మీతో కలవనివ్వాలని , ప్రతీ తల్లి దండ్రులు పిల్లలకు చెప్పాలి. అందం కాదు ముఖ్యం వాళ్ళలో ఉన్న ప్రతిభను చూడాలి  వైకల్యం ఉన్నవాళ్ళు కూడా  క్రుంగిపోకుడదు. వాళ్ళలో ఉన్న ప్రతిభను వెలికి తీసి నలుగురిలో శభాష్ అనిపించుకోమని మీకు ఏమాత్రం తక్కువ కాదు అని తెలియచెప్పాలి. అందం గా ఉన్న ప్రతీ మనిషి అందగాడు  కాదు అందర్ని ఒకేలా చేసే చూసే మంచి మనసున్న వ్యక్తే ఏ అంగవైకల్యం లేనివాడు. ప్లీజ్ వాళ్ళను కూడా మనతో సమానంగా చూద్దాం. చేతనయితే వాళ్ళకు  అండగా వుందాం. సాయం చేద్దాం వాళ్ళను విడిగా మాత్రం చూడొద్దు. మీకు మేమున్నాం అనే భరోసా వాళ్ళకు ఇద్దాం. అల పుట్టడం వాళ్ళు చేసిన తప్పు కాదు ఆ దేవిడి తప్పు .మనం చూస్తున్నాం అంధులుగా  ఉన్నవాళ్లు ఎంతో మంది సంగీతంలో ముందున్నారు. పాటలు పడుతున్నారు ఇంకా ఎన్నో శిఖరాలు అవరోదిస్తున్నారు. ఇంకా అలాంటి వాళ్ళకి చేయూతనిద్దాం. వాళ్ళను కూడా మనతో సమానంగా చూద్దాం..